AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిమానుల మ‌ర‌ణంపై స్పందించిన ప‌వ‌న్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఫ్లెక్సీ కడుతూ క‌రెంట్ షాక్‌తో ముగ్గురు చనిపోయిన ఘటనపై.. జ‌న‌సేనాని తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు.

అభిమానుల మ‌ర‌ణంపై స్పందించిన ప‌వ‌న్ కళ్యాణ్
Ram Naramaneni
|

Updated on: Sep 02, 2020 | 7:33 AM

Share

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఫ్లెక్సీ కడుతూ క‌రెంట్ షాక్‌తో ముగ్గురు చనిపోయిన ఘటనపై.. జ‌న‌సేనాని తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఇది మాటలకు అందని విషాదంగా పేర్కొన్నారు. చ‌నిపోయిన‌వారి తల్లిదండ్రుల గర్భశోకం అర్థం చేసుకోగలనన్న ప‌వ‌న్, దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కానీ, ఆ తల్లిదండ్రులకు తానే బిడ్డగా నిలుస్తానని చెప్పారు. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటానని తెలిపారు. గాయాలపాలైన వారికి మెరుగైన‌ వైద్య సేవలు అందేలా స్థానిక నాయ‌కులతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు చెప్పారు. ఘ‌ట‌నకు సంబంధించి ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

Also Read :వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మ‌ర‌ణం

Follow Us