AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య రాముడి సొమ్ము.. మరుగుదొడ్లలో దాచి.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న దొంగతనం లొసుగులు!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవమైన అయోధ్య శ్రీరాముడి ఆలయ విరాళాల సొమ్ము పక్కదారి పట్టిన ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ చోరీకి సంబంధించి పోలీసులు, ఆలయ ట్రస్ట్ జరుపుతున్న అంతర్గత విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కింపు కేంద్రం నుంచే సిబ్బంది ఎలా మాయం చేశారనే దానిపై విస్తుపోయే విషయాలు ఇంటరాగేషన్‌లో బయటపడ్డాయి.

అయోధ్య రాముడి సొమ్ము.. మరుగుదొడ్లలో దాచి.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న దొంగతనం లొసుగులు!
Ayodhya Sri Ram Mandir
Balaraju Goud
|

Updated on: Jul 01, 2026 | 12:23 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవమైన అయోధ్య శ్రీరాముడి ఆలయ విరాళాల సొమ్ము పక్కదారి పట్టిన ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ చోరీకి సంబంధించి పోలీసులు, ఆలయ ట్రస్ట్ జరుపుతున్న అంతర్గత విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కింపు కేంద్రం నుంచే సిబ్బంది ఎలా మాయం చేశారనే దానిపై విస్తుపోయే విషయాలు ఇంటరాగేషన్‌లో బయటపడ్డాయి.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాశ్ శుక్లాను పోలీసులు అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ ఇంటరాగేషన్‌లో తాను చేసిన పాపాలను, దొంగతనానికి వేసిన స్కెచ్‌ను నిందితుడు ఒప్పుకున్నాడు. విరాళాల సొమ్ము లెక్కింపు బాధ్యతల్లో ఉన్న సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించి, దొంగిలించిన పెద్ద మొత్తంలో నగదును నేరుగా బయటకు తీసుకెళ్లకుండా.. ఆలయ ప్రాంగణంలోని మరుగుదొడ్లలో (Toilets) దాచి ఉంచేవారని నిందితుడు తెలిపాడు. అక్కడ ఎవరికీ అనుమానం రాదని భావించి, ఆ తర్వాత అనుకూలమైన సమయంలో ఆ సొమ్మును గుట్టుచూడకుండా బయటకు తరలించినట్లు వెల్లడించాడు.

లెక్కింపు వ్యవస్థలోని లొసుగులే ఆసరా!

ఆలయానికి వస్తున్న విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఉన్న తీవ్రమైన సాంకేతిక, పరిపాలనాపరమైన లొసుగులను నిందితులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. భక్తులు సమర్పించే కోట్లాది రూపాయల నగదును ఎప్పటికప్పుడు రికార్డుల్లో సరిగ్గా నమోదు చేయకపోవడం, పర్యవేక్షణ లోపించడాన్ని ఆసరాగా చేసుకుని ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారు. కేవలం కొద్ది మొత్తంలో కాకుండా, క్రమక్రమంగా కోట్లాది రూపాయల రాముడి సొమ్మును పక్కదారి పట్టించినట్లు నిందితుడి ఒప్పుకోలు ద్వారా స్పష్టమైంది.

ట్రస్ట్ సీరియస్.. భద్రత మరింత కట్టుదిట్టం

ఈ అక్రమాలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీవ్రంగా స్పందించింది. లెక్కింపు కేంద్రంలో పనిచేస్తున్న అనుమానిత సిబ్బందిపై కఠిన చర్యలకు ఆదేశించింది. రాబోయే రోజుల్లో లెక్కింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు, అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు, కఠినమైన తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేవుడి సొమ్మును అపహరించిన దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us