
రాజస్థాన్‍లోని అటవీప్రాంతానికి దగ్గరగా ఉన్న అల్వార్ నగరంలోకి చిరుతపులి ప్రవేశించి హల్‍చల్ చేసింది. రోడ్డుపై చిరుత పరుగులు తీయడాన్ని చూసిన జనం భయంతో వణికిపోయారు. రోడ్డుపై నుంచి ఇంటి పైకప్పులపైకి వచ్చిన చిరుత…అటూ ఇటూ పరుగులు తీసింది. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని స్థానికులు హడలిపోయారు. వెంటనే పోలీసులకుమ్ అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఓ ఇంటి ముందున్న పార్కింగ్‍ప్లేస్‍లో నక్కిన చిరుతను సుమారు ఏడు గంటలపాటు శ్రమించి బంధించారు అటవీశాఖ సిబ్బంది.