మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటరు’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ మూవీలో ఇస్మార్ట్ బ్యూటీ నభనటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘హే ఇది నేనే నా అంటూ సాగే’ పాట ఎక్కువగా వినిపిస్తుంది.
యంగ్ సింగర్ సిధ్ శ్రీరామ్ పాడిన ఈ పాట రికార్డులు బద్దలు కొడుతోంది.తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీఫుల్ సాంగ్. ఈ పాటకు యూట్యూబ్ లో ఏకంగా 25 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’లాంటి వరుస హిట్ల తర్వాత వస్తున్నసినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.