అందుకే మా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది..

| Edited By:

Jun 29, 2020 | 12:41 PM

సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కి విడుదలైన చిత్రం 'కృష్ణ అండ్ హిజ్ లీల'. ఓటీటీ వేదికగా రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. జెర్సీ సినిమాతో పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్, షాలిని, సీరత్ కపూర్‌లు కనిపించారు. అయితే ఈ సినిమాలో రొమాన్స్ కాస్త ఎక్కువగా ఉందనే...

అందుకే మా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది..
Follow us on

సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కి విడుదలైన చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. ఓటీటీ వేదికగా రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. జెర్సీ సినిమాతో పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్, షాలిని, సీరత్ కపూర్‌లు కనిపించారు. అయితే ఈ సినిమాలో రొమాన్స్ కాస్త ఎక్కువగా ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సందర్భంగా హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. మా సినిమాలో కనిపించే కృష్ణ లాంటి వ్యక్తి అందరిలోనూ ఉంటాడు. అందుకే చూసిన ప్రతీ ఒక్కరూ ఆ పాత్రలో ఎక్కడో తమని తాము చూసుకుంటున్నారు. అదే మా సినిమా విజయానికి కారణం. ఈ చిత్రం సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

అలాగే అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలకు కూడా ఎదురయ్యే అనుభవాలతో మా సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం విషయంలో అన్నింటికంటే అతి పెద్ద సవాల్ ఏంటంటే.. రచనే. నిజానికి ఇది చాలా సెన్సిటివ్ స్టోరీ. అందుకే నేనూ, డైరెక్టర్ ఈ స్టోరీ ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేశాం. ఎక్కడో ఒక అబ్బాయి ఇద్దరమ్మాయిల్ని ప్రేమించడం కరెక్టే అని చెబుతున్నామనే అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. అందుకే సమతూకం పాటిస్తూ కథని ముందుకు నడిపించినట్లు చెప్పుకొచ్చారు హీరో సిద్ధు.

Read More:

కరోనా ఉధృతి నేపథ్యంలో.. మెడికల్ షాపు ఓనర్‌ల కీలక డెసిషన్

అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..