నాన్న కోలుకుంటున్నారు.. దయచేసి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయొద్దు: శివాత్మిక
ప్రస్తుతం నాన్న కోలుకుంటున్నారు.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎవరూ ఆందోళన చెందొద్దు అని హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక ప్రకటించారు. ఆయన ఆరోగ్యంపై ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయొద్దని ఆమె ఈ సందర్భంగా కోరారు. నాన్న గారి ఆరోగ్యం గురించి మీరు చూపించిన ప్రేమాభిమానాలకు వెలకట్టలేనన్న ఆమె, ప్రస్తుతం నాన్న రాజశేఖర్ గారి ఆరోగ్యం ప్రమాదకరంగా లేదని గంట తర్వాత మరో ప్రకటనలో స్పష్టం చేశారు. ఇలా ఉంటే, అటు రాజశేఖర్ కు చికిత్స అందిస్తోన్న […]
ప్రస్తుతం నాన్న కోలుకుంటున్నారు.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎవరూ ఆందోళన చెందొద్దు అని హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక ప్రకటించారు. ఆయన ఆరోగ్యంపై ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయొద్దని ఆమె ఈ సందర్భంగా కోరారు. నాన్న గారి ఆరోగ్యం గురించి మీరు చూపించిన ప్రేమాభిమానాలకు వెలకట్టలేనన్న ఆమె, ప్రస్తుతం నాన్న రాజశేఖర్ గారి ఆరోగ్యం ప్రమాదకరంగా లేదని గంట తర్వాత మరో ప్రకటనలో స్పష్టం చేశారు. ఇలా ఉంటే, అటు రాజశేఖర్ కు చికిత్స అందిస్తోన్న హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ కూడా హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం రాజశేఖర్ కు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామని ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని పేర్కొంది. అటు, మెగాస్టార్ చిరంజీవి కూడా రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆందోళనకరంగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం