‘సింబా’కు నాని మాటసాయం

| Edited By:

Jun 29, 2019 | 4:23 PM

సినిమా ప్రపంచంలో భాషకు ప్రాధాన్యత పెరిగింది. ఇది ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్నదే. ముఖ్యంగా ఇండియన్ స్క్రీన్‌ మీద హాలీవుడ్ మూవీస్‌ కూడా మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. వీటిలో జురాసిక్ పార్క్,టైటానిక్,అవతార్,జంగిల్ బుక్, లైప్ ఆఫ్ పై వంటి వాటిని చెప్పుకోవచ్చు. యాక్షన్ మూవీస్‌తో పాటు యానిమేటెడ్ మూవీస్ కూడా మంచి కలెక్షన్‌లను రాబడుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే లయన్ కింగ్ ‌మూవీ తెలుగులో రాబోతుంది. గతంలో డిస్నీ సృష్టించిన కామిక్. […]

సింబాకు నాని మాటసాయం
Follow us on

సినిమా ప్రపంచంలో భాషకు ప్రాధాన్యత పెరిగింది. ఇది ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్నదే. ముఖ్యంగా ఇండియన్ స్క్రీన్‌ మీద హాలీవుడ్ మూవీస్‌ కూడా మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. వీటిలో జురాసిక్ పార్క్,టైటానిక్,అవతార్,జంగిల్ బుక్, లైప్ ఆఫ్ పై వంటి వాటిని చెప్పుకోవచ్చు. యాక్షన్ మూవీస్‌తో పాటు యానిమేటెడ్ మూవీస్ కూడా మంచి కలెక్షన్‌లను రాబడుతున్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే లయన్ కింగ్ ‌మూవీ తెలుగులో రాబోతుంది. గతంలో డిస్నీ సృష్టించిన కామిక్. మన చందమామ కథలు, పేదరాశిపెద్దమ్మ కథలు,పంచతంత్ర కథల్లో ఉన్నట్టుగా జంతువులు మాట్లాడతాయి. అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ కుటుంబ బాంధవ్యాలు, ప్రేమలు ఆప్యాయతలు చూపిస్తుంటాయి. అడవికి రాజుగా ఓ సింహం, రాణిగా ఆడ సింహం ఉంటాయి. వీరికి పుట్టిన పసికూన అనూహ్య పరిణామాల నేపధ్యలో అడవిలో మరో ప్రాంతానికి పారిపోతుంది. అదే సమయంలో ఊహించని విధంగా తండ్రి సింహం మరణిస్తుంది. ఆ తర్వాత పసికూనగా ఉన్న సింహం ఎలా పెరిగి పెద్దదవుతుంది? తన తండ్రి రాజ్యాన్ని ఎలా చేజిక్కించుకుంటుంది అనేది ఈ మూవీలో అసలు కథ.

అయితే ఇది గతంలో 2డీ యానిమేషన్ సినిమాగా తీసారు. అయితే దాన్నే మళ్లీ జంగిల్ బుక్ డైరెక్టర్ జాన్ ఫెరో డెరెక్షన్‌లో సింబా మూవీ రాబోతుంది. ఈ చిత్రం జూలై 19న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో చిన్న సింహం సింబా పాత్రకు నాచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెబుతున్నాడు. ఈ విషయాన్ని ట్వీట్టర్ ద్వారా అఫీషియల్‌గా ఎన్సౌన్స్ చేశాడు. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రధాన పాత్రలైన ముసాఫాకు రవిశంకర్,స్కార్ అనే పాత్రకు జగపతిబాబు, పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పారు. హాలీవుడ్ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ నటులు డబ్బింగ్ చెబుతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.