ప్రపంచంలో అత్యంత కరోనా ప్రభావిత దేశాలు.. భారత్ ఏ స్థానంలో ఉందంటే.!

ప్రపంచంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే లక్షల మంది ప్రజలు మృత్యువాతపడ్డారు. అటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది.

ప్రపంచంలో అత్యంత కరోనా ప్రభావిత దేశాలు.. భారత్ ఏ స్థానంలో ఉందంటే.!

Updated on: May 17, 2020 | 12:40 PM

ప్రపంచంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే లక్షల మంది ప్రజలు మృత్యువాతపడ్డారు. అటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ మహమ్మారి ఇప్పటికే 213 దేశాలకు పాకింది. వీటిల్లో అత్యంత కరోనా ప్రభావిత దేశాలను ఒకసారి పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. తాజాగా నమోదైన లెక్కల ప్రకారం అగ్రరాజ్యం అమెరికా మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ అత్యధిక పాజిటివ్ కేసులు(1,507,773), మరణాలు(90,113) సంభవించాయి.

ఇక ఆ తర్వాత స్పెయిన్, రష్యా, బ్రిటన్, బ్రెజిల్ దేశాలలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటి 3 లక్షలకు చేరువ అవుతోంది. అటు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, ఇరాన్ దేశాలు టాప్ 10 లిస్టులో చేరిపోయాయి. మరోవైపు భారత్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 90,927 పాజిటివ్ కేసులు, 2,872 మరణాలు నమోదయ్యాయి. ఇక కరోనా పుట్టినిల్లు అయిన చైనాను భారత్ దాటేయడమే కాకుండా.. కరోనా కేసుల సంఖ్య లక్షకు దగ్గర పడుతోంది. కాగా, దేశంలో లాక్ డౌన్ మరోసారి మే 31 వరకు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read More:

ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు!

వలస కూలీలకు ఉచిత ప్రయాణం.. జగన్ మార్క్ డెసిషన్

తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..

రేపటి నుంచి లాక్‌డౌన్‌ 4.0.. రూల్స్ ఇలా ఉండనున్నాయా!