AP, TS Weather Report: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జోరు వానలు కురిశాయి. 30 నుంచి 40 కిమీ మేర బలమైన గాలులు వీచాయి. పలు ప్రాంతాల్లో ఉరుములుమెరుపులతో వర్షాలు కురిశాయి. ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, వెలుగోడు ప్రాంతాల్లో అయితే వాగులు వంకలు పొంగిపొర్లడంతో పంట పొలాలు నీట మునిగాయి. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అండర్ రైల్వే బ్రిడ్జి దగ్గర రహదారి జలమయం అయ్యింది.
కాజిపేట రైల్వేస్టేషన్ అయితే చెరువులా మారింది. భారీగా వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇంకా మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ తెలంగాణలోని 18 జిల్లాలకు వాతారణ శాఖ అరెంజ్ అలెర్ట్ ప్రటించింది.
మరోవైపు కేరళలో కూడా భారీ వర్షాలు పడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ వర్షం కారణంగా ఓ వ్యక్తి మరణించగా, పలువురికి గాయలయ్యాయి. వర్షాలు ఇంకా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేరళలోని ఇడుక్కి, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు రెడ్‌అలర్ట్.. మరో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇంకా కాసర్‌గోడ్‌లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించబడింది.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..