AP Weather Report: ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరో 3 రోజుల పాటు వర్షాలు

|

Aug 26, 2021 | 1:51 PM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా ఏపీలో మరో 3 రోజులు పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.  రాష్ట్రంలో....

AP Weather Report: ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరో 3 రోజుల పాటు వర్షాలు
Rains In AP
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా ఏపీలో మరో 3 రోజులు పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.  రాష్ట్రంలో ప్రధానంగా నైరుతి గాలులు/ పశ్చిమ గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.
—————————————–

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
—————————————————
ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :
——————————
ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:
———————-
ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలోనూ భారీ వర్షాలు

ఇక మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా రాజధాని నగరం హైదరాబాద్ లో వర్షం దంచికొడుతుంది. విడుతల వారీగా సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది.  ఇక నిజామాబాద్ జిల్లా కోటగిరిలో కుంభవృష్టి కురిసింది. ఇక్కడ అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిరోజులు భారీ వర్షాలు పడటంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రైతన్నలు పలు చోట్లు విత్తనాలు వేస్తున్నారు. ఇకపై వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో మరికొందరు సీడ్స్ వేసేందుకు సన్నద్దమవుతున్నారు.

Also Read: పతీ సహగమనం: అర్ధాంగి లేని జీవితాన్ని ఊహించుకోలేకోయాడు.. ఆమె చితిలోకి దూకి తనువు చాలించాడు

దండిగా సొమ్ములిస్తుంది అనుకుంటే.. సొమ్మసిల్లేలా చేస్తోన్న ట్యూనా చేప.. కేజీ రూ.50కే