Rain alert: చినుకులు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు చల్ల చల్లని కూల్ న్యూస్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

|

Jun 23, 2024 | 1:41 PM

పేరుకు వర్షాకాలమే, కానీ ఎండలు మండిపోతున్నాయ్‌. జూన్‌ నెల ముగుస్తున్నా వాన జాడే కనిపించడం లేదు. ఈ తరుణంలో వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

Rain alert: చినుకులు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు చల్ల చల్లని కూల్ న్యూస్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Rain Alert
Follow us on

పేరుకు వర్షాకాలమే, కానీ ఎండలు మండిపోతున్నాయ్‌. జూన్‌ నెల ముగుస్తున్నా వాన జాడే కనిపించడం లేదు. ఈ తరుణంలో వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఆదివారం, సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనావేశారు. ఇప్పటికే పులు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తాజాగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఏపీలో పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఐఎండీ.. పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

అలాగే, తెలంగాణలో కూడా పలు జిల్లాలకు వర్షసూచన చేసింది వాతావరణశాఖ. హన్మకొండ, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు పనులు నిలిచిపోయినట్టు చెప్పారు సింగరేణి అధికారులు.. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం కురవడంతో సత్తుపల్లిలో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలతోపాటు రోడ్లపైనా పెద్దఎత్తున నీరు నిలిచిపోయింది. సత్తుపల్లితోపాటు పెనుబల్లి, కల్లూరు మండలాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది.

కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలో వర్షం దంచికొట్టింది. వర్షబీభత్సానికి పెద్దవాగుపై నిర్మించిన అందవెల్లి బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్‌ కొట్టుకుపోయింది. పెద్దవాగు ఉప్పొంగడంతో అప్రోచ్ రోడ్ కోతకు గురైంది. దాంతో, కాగజ్‌నగర్ – దహేగాం మండలాల మధ్య 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండేళ్ల కిందటే ఈ బ్రిడ్జ్ కుంగిపోయింది. గతేడాది భారీ వర్షాలకు బ్రిడ్జ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. పునర్నిర్మాణం ఆలస్యం అవడం… ఇప్పుడు అప్రోచ్ రోడ్ కూడా కొట్టుకుపోవడంతో ఈ ఏడాది కూడా వర్షాకాలం తిప్పలు మళ్లీ మొదలయ్యాయ్‌.

వర్షాల కోసం పూజలు..

కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతుంటే… మరోవైపు వర్షాల లేక.. వరుణ దేవుడు కరుణించాలని పల్లెలు, పట్టణాల్లో పూజలు చేస్తున్నారు జనం. వర్షాలు కురవాలంటూ హన్మకొండలో పోచమ్మతల్లి, కనకదుర్గమ్మకు జలాభిషేకాలు చేశారు మహిళలు. పసుపు, గంధం, కుంకుమ, పూలు, వేపాకుతో దేవతలకు పౌర్ణమి పూజలు నిర్వహించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..