బీ కేర్‌ఫుల్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు

| Edited By:

Oct 20, 2019 | 8:15 AM

తెలుగు రాష్ట్రాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో శనివారం కురిసిన భారీ వర్షాలకు జనం తడిసిముద్దైపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు ఒకేసారి విస్తరించడంతో ఈ వర్షాలు పడ్డట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో కూడా శనివారం రాత్రి పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ […]

బీ కేర్‌ఫుల్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు
Follow us on

తెలుగు రాష్ట్రాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో శనివారం కురిసిన భారీ వర్షాలకు జనం తడిసిముద్దైపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు ఒకేసారి విస్తరించడంతో ఈ వర్షాలు పడ్డట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో కూడా శనివారం రాత్రి పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. పరకాలలో ఏకంగా 19 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. నర్సంపేటలో 15 సెం.మీ. వర్షంపాతం నమోదైంది. కొత్తగూడలో 12 సెం.మీ, నల్లబెల్లిలో 11 సెం.మీ వర్షం పడింది.

కాగా, ఈ సీజన్‌‌లో వర్షాలు విస్తారంగా కురిసినట్లు అధికారులు తెలిపారు. సాధారణం కంటే 35శాతం వర్షపాతం అధికంగా కురిసినట్లు వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 66.4 మిల్లీమీటర్లు కాగా, 89.4 మిల్లీమీటర్లు నమోదైందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే తూర్పు, ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో.. ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపుల కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.