వర్షాలతో పంజాబ్, హర్యానావాసులకు ఉపశమనం

| Edited By:

Jun 05, 2019 | 3:43 PM

దేశవ్యాప్తంగా భానుడి ప్రభావం కొనసాగుతోంది. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 48డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే అక్కడక్కడా పడ్డ వర్షాలు ప్రజలకు కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన జమ్ము కశ్మీర్, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌లో మంగళవారం వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడినప్పటికీ.. మరికొన్ని ప్రదేశాల్లో మాత్రం గాలులతో కూడిన మోస్తారు వానలు కురిశాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, విదర్భలలో మాత్రం ఎండల తీవ్రత […]

వర్షాలతో పంజాబ్, హర్యానావాసులకు ఉపశమనం
Follow us on

దేశవ్యాప్తంగా భానుడి ప్రభావం కొనసాగుతోంది. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 48డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే అక్కడక్కడా పడ్డ వర్షాలు ప్రజలకు కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన జమ్ము కశ్మీర్, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌లో మంగళవారం వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడినప్పటికీ.. మరికొన్ని ప్రదేశాల్లో మాత్రం గాలులతో కూడిన మోస్తారు వానలు కురిశాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, విదర్భలలో మాత్రం ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రానున్న మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు ఉండవని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడ్డ విషయం తెలిసిందే.