గుండెపోటుతో తమిళనాడు ఎమ్మెల్యే మృతి

| Edited By:

Mar 21, 2019 | 12:59 PM

చెన్నై : అన్నాడీఎంకే ఎమ్మెల్యే కనగరాజ్‌ గుండెపోటుతో ఇవాళ ఉదయం మృతిచెందారు. సులూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇవాళ ఉదయం మరణించారు. ఎమ్మెల్యే కనగరాజ్‌ ఈ రోజు ఉదయం న్యూస్‌ పేపర్‌ చదువుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సీఎం పళనస్వామితో పాటు పలువురు మంత్రులు నివాళి అర్పించేందుకు కోయంబత్తూరు బయల్దేరి వెళ్లనున్నారు. కనగరాజ్‌ వ్యక్తిగతంగా వ్యవసాయదారుడు. కనగరాజ్‌ మృతితో తమిళనాడు […]

గుండెపోటుతో తమిళనాడు ఎమ్మెల్యే మృతి
Follow us on

చెన్నై : అన్నాడీఎంకే ఎమ్మెల్యే కనగరాజ్‌ గుండెపోటుతో ఇవాళ ఉదయం మృతిచెందారు. సులూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇవాళ ఉదయం మరణించారు. ఎమ్మెల్యే కనగరాజ్‌ ఈ రోజు ఉదయం న్యూస్‌ పేపర్‌ చదువుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సీఎం పళనస్వామితో పాటు పలువురు మంత్రులు నివాళి అర్పించేందుకు కోయంబత్తూరు బయల్దేరి వెళ్లనున్నారు. కనగరాజ్‌ వ్యక్తిగతంగా వ్యవసాయదారుడు. కనగరాజ్‌ మృతితో తమిళనాడు అసెంబ్లీలో ఏఐఏడీఎంకే సంఖ్యా బలం 113కు తగ్గింది. కాగా 2016 మే నుంచి ఇప్పటివరకూ అయిదుగురు ఎమ్మెల్యేలు చనిపోయారు. శ్రీనివేల్‌, ఏకే బోస్‌ (తిరుప్పరంగుండ్రం), జయలలిత (ఆర్కే నగర్‌) కరుణానిధి (తిరువారూర్‌), కనగరాజ్‌ (సులూరు) అనారోగ్యంతో కన్నుమూశారు.