సమ్మె విరమించండి : మంత్రి ఈటల

జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జూడాలు తమ ఆందోళనను విరమించాలని కోరారు. జూడాల ప్రతినిధులు శనివారం సాయంత్రం మంత్రి ఈటలను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా వారు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందించారు. ఎన్‌ఎంసీ బిల్లులో జూడాలకు సంబంధించి అసంబద్దమైన సెక్షన్లు ఉన్నాయని, వీటిని తొలగించాలని జూడాలు కోరారు.  దీనిపై మంత్రి ఈటల మాట్లాడుతూ ఈ […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:30 am, Sun, 4 August 19
సమ్మె విరమించండి : మంత్రి ఈటల

జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జూడాలు తమ ఆందోళనను విరమించాలని కోరారు. జూడాల ప్రతినిధులు శనివారం సాయంత్రం మంత్రి ఈటలను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా వారు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందించారు. ఎన్‌ఎంసీ బిల్లులో జూడాలకు సంబంధించి అసంబద్దమైన సెక్షన్లు ఉన్నాయని, వీటిని తొలగించాలని జూడాలు కోరారు.  దీనిపై మంత్రి ఈటల మాట్లాడుతూ ఈ విషయాన్ని కేంద్ర మంత్రితో  చర్చిస్తానని హామీ ఇచ్చినా .. సమ్మె విరమణపై  డాక్టర్లు  తిరస్కరించారు.

అయితే తాము కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్నామని, గుర్తు చేశారు. ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు కొనసాగిస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌లో జూనియర్ వైద్యుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.