Benefits With Garlic: చలికాలంలో వెల్లుల్లి ఎక్కువగా ఎందుకు తీసుకోవాలో తెలుసా..? ఇవీ లాభాలు..

|

Jan 12, 2021 | 12:26 AM

Health Benefits With Garlic In Winter: దాదాపు ప్రతి వంటకంలో కచ్చితంగా ఉపయోగించే ఆహార పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లి లేకుండా చేసే వంటకాలను..

Benefits With Garlic: చలికాలంలో వెల్లుల్లి ఎక్కువగా ఎందుకు తీసుకోవాలో తెలుసా..? ఇవీ లాభాలు..
Follow us on

Health Benefits With Garlic In Winter: దాదాపు ప్రతి వంటకంలో కచ్చితంగా ఉపయోగించే ఆహార పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లి లేకుండా చేసే వంటకాలను వేళ్లపై కూడా లెక్కించలేము. వంటకు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించడంలో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం. ఈ క్రమంలోనే చలికాలంలో ఆహారపదార్థాల్లో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అసలు వెల్లుల్లిని చలికాలంలో తీసుకోవడం వల్ల కలిగే లాభాలెంటీ.? చలికి ఈ ఆహార పదార్థానికి సంబంధం ఏంటన్న విషయాలు ఇప్పుడు చూద్దాం..

* రోజువారి ఆహార పదార్థాల్లో వెల్లుల్లిని భాగంగా చేసుకుంటే శరీర ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత అంతగా ఉండదు.
* వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫ్రీ ర్యాడికల్స్‌ కారణంగా మన శరీరంలో పాడయ్యే కణాలను బాగుచేయడానికి, ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గించడానికి వెల్లల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది.
* వెల్లుల్లిలోని విటమిన్‌సి, విటమిన్‌ బి6 (పైరిడాక్సిన్‌)లు రోగనిరోధక శక్తి పెరగడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీని ద్వారా సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది.
* పడిగడుపున (ఖాళీ కడుపు) పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి.
* వెల్లుల్లిలోని అల్లిసిన్‌.. రక్తంలో ఉన్న కొవ్వు స్థాయిలను నియంత్రిస్తుంది.
* గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది.  ఒక గ్లాస్‌ నీటిలో వెల్లుల్లి రసాన్ని కలిపి నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి.

Also Read: Hair Protect Tips in home: మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ? మీ ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో ఇలా ట్రై చేయండి..