Health benefits of spinach: బ్రెస్ట్ క్యాన్సర్‏ను పాలకూర అదుపు చేస్తుందా ? పోషకాహార నిధిగా ..

సాధరణంగా ఆకు కూరలు తినడం వలన ఆరోగ్యానికి మంచిదని చాలా మంది అంటుంటారు. అందులో పాలకూర, తోటకూర వంటివి చాలా ఉంటాయి. ఇందులో పాలకూర

Health benefits of spinach: బ్రెస్ట్ క్యాన్సర్‏ను పాలకూర అదుపు చేస్తుందా ? పోషకాహార నిధిగా ..

Updated on: Feb 01, 2021 | 8:55 PM

సాధరణంగా ఆకు కూరలు తినడం వలన ఆరోగ్యానికి మంచిదని చాలా మంది అంటుంటారు. అందులో పాలకూర, తోటకూర వంటివి చాలా ఉంటాయి. ఇందులో పాలకూర ఎక్కువగా తినడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయంటా. ఇందులో దాదాపు పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట. అంతేకాకుండా యాంటీ క్యాన్సర్ ఏజెంట్‏గా పనిచేస్తుంది. మరీ పాలకూర తినడం వలన కలిగే లాభాలెంటో తెలుసుకుందామా..

పాలకూరను ఎక్కువగా తినడం వల్ల ఊపిరితిత్తులు బ్రెస్ట్ క్యాన్సర్‏ని అదుపు చేయడానికి తొడ్పతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి, ఏ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ క్యాన్సర్‏ను నివారించడానికి సహయపడతాయి. వీటితోపాటు గుండె జబ్బులు రాకుండా కూడా చూసుకుంటాయి. పాలకూరలో ప్రొటీన్లు, విటమిన్ సి, ఏ, కాల్షియం వంటి ఎన్నో ఉన్నాయి. శరీరానికి కావాల్సిన ఐరన్ శాతాన్ని పాలకూర అందిస్తుంది. అలాగే శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పెరిగే కొద్ది వచ్చే మతిమరుపు వంటి లక్షణాలను నివారించేందుకు పాలకూర సహయపడుతుంది. వారంలో ఒకసారి పాలకూర తినడం వలన రోగనిరోధక శక్తిని కూడా పెంపోందించుకోవచ్చు. ఇవే కాకుండా పాలకూర ఎక్కువగా తినడం వలన అందంగా కనిపిస్తారు.

Also Read: