AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా ?.. అయితే జీలకర్రతో ఇలా ఒకసారి ట్రై చేయండి..

రోజువారీ వంటల్లో ఉపయోగించే ముఖ్యమైన పోపు దినుసు జీలకర్ర. అయితే కేవలం జీలకర్ర ఆహారానికి రుచి, సువాసన అందిస్తుందని మాత్రమే తెలుసు. కానీ జీలకర్ర బరువును

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా ?.. అయితే జీలకర్రతో ఇలా ఒకసారి ట్రై చేయండి..
Rajitha Chanti
|

Updated on: Dec 31, 2020 | 12:26 PM

Share

రోజువారీ వంటల్లో ఉపయోగించే ముఖ్యమైన పోపు దినుసు జీలకర్ర. అయితే కేవలం జీలకర్ర ఆహారానికి రుచి, సువాసన అందిస్తుందని మాత్రమే తెలుసు. కానీ జీలకర్ర బరువును తగ్గించడంతోపాటు కొన్ని రకాల సమస్యలను కూడా దూరం చేస్తాయట. జీలకర్రతో కలిగే లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి ప్రయత్నించేవారికి ఈ జీలకర్ర చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఆహరంలోకి జీలకర్ర తీసుకోవడంతోపాటు, వాటిని జ్యూస్ చేసి తాగడం వలన శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలువడింది. ఆ సంస్థ వారు 80 మంది మహిళలను రెండు గ్రూపులుగా విడదీశారు. అందులో కొంత మంది జీలకర్రను ఉపయోగించగా.. మిగతావారు ఇతర డైట్ కంట్రోల్‏ను వాడారు. ఇందులో ఇతర డైట్ సిస్టంను వాడినవారి కంటే జీలకర్రను వాడినవారు బరువు తగ్గినట్లు తేలింది. దీంతో జీర్ణక్రియ సరిగా పనిచేస్తుంది. జీలకర్ర రోజూ తినడం వల్ల బరువు తగ్గడం మాత్రం తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు.

జీలకర్ర రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి పేగులను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్ ఉండడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఐరన్ శక్తిని అందిస్తుంది. వీటితోపాటు శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‏ను బయటకు పంపుతుంది. శరీరంలో మంటను తగ్గించి, బరువు తగ్గడానికి సహయపడుతుంది.

జీలకర్ర పొడి మరియు పెరుగు.. ఒక టీస్పూన్ జీలకర్రను ఒక టీస్పూన్ పెరుగుతో కలిపాలి. ఆ మిశ్రమాన్ని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత తినాలి. ఇలా కనీసం 15 రోజులు చేయడం వలన క్రమంగా బరువు తగ్గుతారు.

జీలకర్ర పానీయం.. రాత్రి సమయంలో జీలకర్రను నానబెట్టి.. ఉదయాన్నే మరిగించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి తాగాలి. అందులో కాస్తా నిమ్మకాయ కలిపి తాగితే రుచి బాగుంటుంది. ఇలా 2 వారాల పాటు చేయడం వలన బరువు తగ్గుతారు.