హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీరేట్లలో స్వల్ప తగ్గుదల‌

| Edited By:

Mar 09, 2019 | 3:16 PM

ప్రైవేట్ రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంపిక చేసిన రుణాలపై వడ్డీరేట్లను స్వల్పంగా తగ్గించింది. రెండు, మూడేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రుణ రేటు 8.85 శాతానికి, 9 శాతానికి తగ్గాయి. అంతకుముందు వడ్డీరేట్లు 8.90 శాతంగాను, 9.05 శాతంగా ఉన్నాయి. సవరించిన రేట్లు గురువారం నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. కానీ, మిగతా రుణాల వడ్డీరేట్లలో ఎలాంటి […]

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీరేట్లలో స్వల్ప తగ్గుదల‌
Follow us on

ప్రైవేట్ రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంపిక చేసిన రుణాలపై వడ్డీరేట్లను స్వల్పంగా తగ్గించింది. రెండు, మూడేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రుణ రేటు 8.85 శాతానికి, 9 శాతానికి తగ్గాయి. అంతకుముందు వడ్డీరేట్లు 8.90 శాతంగాను, 9.05 శాతంగా ఉన్నాయి. సవరించిన రేట్లు గురువారం నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. కానీ, మిగతా రుణాల వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఒకరోజు, నెల, మూడు, ఆరు, ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేట్లు వరుసగా 8.35 శాతం, 8.40 శాతం, 8.45 శాతం, 8.55శాతం, 8.75 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ, వాహన, ఇతర రుణాలు చెల్లించేవారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరనున్నది.