RIP Arun Jaitley: కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉంది..

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి తీవ్రంగా కలచివేస్తోందన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. వ్యక్తిగతంగా నాకు పెద్ద లోటు అని వ్యాఖ్యానించారు. నాకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి అని అన్నారు. మా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన.. జైట్లీ మరణ వార్త వినడంతో హుటాహెుటిన ఢిల్లీకి బయల్దేరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ […]

RIP Arun Jaitley: కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉంది..

Edited By:

Updated on: Aug 24, 2019 | 3:15 PM

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి తీవ్రంగా కలచివేస్తోందన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. వ్యక్తిగతంగా నాకు పెద్ద లోటు అని వ్యాఖ్యానించారు. నాకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి అని అన్నారు. మా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా.. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన.. జైట్లీ మరణ వార్త వినడంతో హుటాహెుటిన ఢిల్లీకి బయల్దేరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈ రోజంతా హైదరాబాద్‌లోనే ఉండాల్సి ఉంది.