AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుఎస్…. సీరియల్ రేపిస్టుకు 23 ఏళ్ళ జైలుశిక్ష

హాలీవుడ్ మాజీ ప్రొడ్యూసర్ హార్వే వీన్ స్టీన్ కి న్యూయార్క్ కోర్టు 23 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. 2006 లో మిరియం హాలే అనే మహిళా ప్రొడక్షన్ అసిస్టెంట్ పై లైంగిక దాడి, 2013 లో జెస్సికా మాన్ అనే నటిపై థర్డ్ డిగ్రీ రేప్ కు పాల్పడ్డాడన్న  ఆరోపణలపై ఆయనకు కోర్టు

యుఎస్.... సీరియల్ రేపిస్టుకు 23 ఏళ్ళ జైలుశిక్ష
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 12, 2020 | 5:22 PM

Share

హాలీవుడ్ మాజీ ప్రొడ్యూసర్ హార్వే వీన్ స్టీన్ కి న్యూయార్క్ కోర్టు 23 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. 2006 లో మిరియం హాలే అనే మహిళా ప్రొడక్షన్ అసిస్టెంట్ పై లైంగిక దాడి, 2013 లో జెస్సికా మాన్ అనే నటిపై థర్డ్ డిగ్రీ రేప్ కు పాల్పడ్డాడన్న  ఆరోపణలపై ఆయనకు కోర్టు ఈ సుదీర్ఘ జైలు శిక్ష విధించింది. ఈయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ శిక్షను ఐదేళ్లకు తగ్గించాలన్న హార్వే తరఫు న్యాయవాదులు చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. నిజానికి ఇతనికి 29 సంవత్సరాల కారాగార శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు అభిప్రాయపడ్డారు. రెండేళ్ల క్రితం ‘మీ టూ’ ఉద్యమ విస్తరించడానికి హార్వే ‘కీచక ఉదంతం’ నాంది పలికిన  ఘటనగా ఈ కేసు ‘పాపులర్’ అయింది. సుమారు 80 మంది మాజీ మోడల్స్, నటీమణులు, ఇతర మహిళలపై దారుణంగా అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. 67 ఏళ్ళ హార్వే.. మొట్టమొదటిసారిగా తన ‘పాపాలకు’ పశ్చాత్తాపం చెందుతున్నట్టు ప్రకటించాడు. అయితే ‘మీటూ’ఉద్యమానికి తన ‘నిర్వాకం’ కారణమైందన్న వార్తలు అయోమయంగా ఉన్నాయని, ముఖ్యంగా మగవారు కన్ ఫ్యుజ్ అవుతున్నారని హార్వే పేర్కొన్నాడు. ఇతడిని సెక్స్ అఫెండర్ గా వ్యవహరించవచ్చునని కోర్టు తీవ్ర వ్యాఖ్య చేసింది. ఇతనికి 23 ఏళ్ళ జైలు శిక్ష సరిపోదని, ఇంకా పెంచాలని ఇతని బారిన పడిన బాధితురాళ్ళు డిమాండ్ చేశారు.