పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారా.. లేదంటే నిర్మాతలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా..? ఈ విషయం తెలియక చాలా మంది దర్శకులు తామే కన్ఫ్యూజన్‌లోకి వెళ్లిపోతున్నారు. వీటన్నింటికీ క్లారిటీ రావాలంటే పవన్ క్లారిటీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే తాజాగా ఆయన లుక్ మారింది.. పొలిటికల్ ట్రిప్పు మారింది. పైగా తాజా ఫోటోలు చాలా అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ ఏంటా ఫోటోలు.. వాటిలో ఏముంది..? మళ్లీ పాత కథే.. పవన్ ఎప్పుడెప్పుడు షూటింగ్స్ వైపు వస్తారా కోట్ల బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు.. కథలు రాసుకున్న దర్శకులు.. సినిమాల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. కానీ పవన్ మాత్రం ఎప్పుడు పొలిటికల్ మూడ్‌లో ఉంటారో.. ఎప్పుడు లుక్ మార్చి సినిమాల్లోకి వస్తారో అర్థం కావట్లేదు. కొన్ని రోజుల కింది వరకు జనంలోనే ఉన్న జనసేనాని మనసు ఇప్పుడు సినిమాల వైపు మళ్లింది. దానికోసం గెటప్ కూడా మార్చేసారు ఈయన.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లుతో పాటు భవదీయుడు భగత్‌సింగ్, సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా, సముద్రఖని వినోదీయ సితం రీమేక్స్‌కు కమిటయ్యారు. సురేందర్ రెడ్డి సినిమా ఉన్నా.. ఇప్పట్లో అది తేలేది కాదు. వీటిలో హరిహర వీరమల్లు షూటింగ్ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. అక్టోబర్‌లో దీనికోసమే పవన్ డేట్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలు, ప్రి వర్క్‌షాప్ వీడియో దీనికి సాక్ష్యం. అందులో పవిత్రమైన సరస్వతీ పంచమి రోజున..సరస్వతీ ఆశీస్సులతో హరిహర షెడ్యూల్ వర్క్ షాప్ అని రాసి ఉంది. అక్టోబర్‌లో హరిహర వీరమల్లు బ్యాలెన్స్ పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు పవన్. నిన్నమొన్నటి వరకు ఉన్న లుక్ కాకుండా.. కాస్త మాస్ గెటప్‌లోకి వచ్చారు పవన్.
ఇది చూస్తుంటే కచ్చితంగా మళ్లీ సినిమాల వైపు వస్తున్నారని అర్థమవుతుంది. అయితే అది హరిహర కోసమేనా అనే కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఒక్కటైతే ఖాయం.. రాబోయే మూడు నెలలు పూర్తిగా సినిమాలకే కేటాయించాలని భావిస్తున్నారు పవన్. అదైతే నిర్మాతలకు సంతోషాన్ని కలిగించే విషయం.
With the divine blessings of Sarawasthi Devi, on the day of Saraswati Pooja, we started our intrusive and extensive pre-schedule Workshop of #HariHaraVeeraMallu. Whole film team has joined it before an EPIC schedule begins from mid-October.
▶️ https://t.co/3aSxnmV8RJ pic.twitter.com/H8Q0KW69RG
— Mega Surya Production (@MegaSuryaProd) September 30, 2022
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..