Hardik Pandya: డొమెస్టిక్ హెల్మెట్.. ఇంటర్నేషనల్ ‘మిస్టేక్’.. పాండ్యా! ఏమిటి నీ ఫ్యూచర్!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. వెన్ను గాయం నుంచి కోలుకుని ఇటీవలే గ్రౌండ్‌లోకి దిగిన అతడు డీవై పాటిల్‌ టీ20 కప్‌లో భాగంగా రిలయన్స్‌-1 జట్టు తరఫున ఆడాడు. ఈ మ్యాచ్‌లో తన సహజసిద్ధమైన ఆటతో ప్రేక్షకులను అలరించాడు..

Hardik Pandya: డొమెస్టిక్ హెల్మెట్.. ఇంటర్నేషనల్ 'మిస్టేక్'.. పాండ్యా! ఏమిటి నీ ఫ్యూచర్!
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 01, 2020 | 2:22 PM

Hardik Pandya Controversy: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. వెన్ను గాయం నుంచి కోలుకుని ఇటీవలే గ్రౌండ్‌లోకి దిగిన అతడు డీవై పాటిల్‌ టీ20 కప్‌లో భాగంగా రిలయన్స్‌-1 జట్టు తరఫున ఆడాడు. ఈ మ్యాచ్‌లో తన సహజసిద్ధమైన ఆటతో ప్రేక్షకులను అలరించాడు. 25 బంతుల్లోనే 38 పరుగులు రాబట్టడమే కాకుండా.. మూడు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనితో దాదాపుగా సఫారీలతో సిరీస్‌కు రీ-ఎంట్రీ ఖరారు అయినట్లే.

అయితే అవగాహన లేక ఈ మ్యాచ్‌ ద్వారా ఊహించని విధంగా చిక్కుల్లో పడ్డాడు. దేశవాళీ క్రికెట్‌లో ఇంటర్నేషనల్ హెల్మెట్ వాడాడు. బీసీసీఐ నిబంధనలకు ఇది విరుద్ధం. మరి దీనిపై బీసీసీఐ ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. కాగా, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా స్వదేశంలో జరగనున్న సఫారీల సిరీస్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది.

For More News:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెరిగిన పింఛన్ల సంఖ్య.!

యువతిని నమ్మించి రిలేషన్ పెట్టుకున్నా అత్యాచారమే.. హైకోర్టు సంచలన తీర్పు!

భారత్ బౌలర్ల విశ్వరూపం.. రెండో టెస్టులో పట్టుబిగించిన టీమిండియా!

అమరవీరుల త్యాగఫలం.. భరతమాతకు అభినందనం.. టీవీ9 ప్రత్యేక కార్యక్రమం

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్… బీటెక్‌లో ఆరు కొత్త కోర్సులు.!

లీకైన దేవరకొండ ‘ఫైటర్’ లుక్.. ఫోటోలు వైరల్.!

వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలెండర్ ధరలు..