భజ్జీ దేశభక్తి అదుర్స్! పాక్‌ను అనవసరంగా ఇన్వాల్వ్ చేశాడా?

|

Jul 23, 2019 | 3:19 PM

అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ నవ చరిత్రను సృష్టించింది. మువ్వన్నెల జెండా స్థాయిని గగనతలంలో గర్వంగా నిలబెట్టబోతుంది.   చంద్రయాన్ 2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా సాగింది. చంద్రయాన్ నింగిలోకి దూసుకెళ్తుంటే దేశ ప్రజలంతా ఉద్వేగానికి లోనయ్యారు .  22న మధ్యాహ్నం 2.43 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 2 ఉపగ్రహం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్‌ఎల్వీ మార్క్ 3 ఎం 1 వాహకనౌక ద్వారా చంద్రయాన్ 2 […]

భజ్జీ దేశభక్తి అదుర్స్! పాక్‌ను అనవసరంగా ఇన్వాల్వ్ చేశాడా?
Follow us on

అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ నవ చరిత్రను సృష్టించింది. మువ్వన్నెల జెండా స్థాయిని గగనతలంలో గర్వంగా నిలబెట్టబోతుంది.   చంద్రయాన్ 2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా సాగింది. చంద్రయాన్ నింగిలోకి దూసుకెళ్తుంటే దేశ ప్రజలంతా ఉద్వేగానికి లోనయ్యారు .  22న మధ్యాహ్నం 2.43 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 2 ఉపగ్రహం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్‌ఎల్వీ మార్క్ 3 ఎం 1 వాహకనౌక ద్వారా చంద్రయాన్ 2 శాటిలైట్‌ను ప్రయోగించారు. సుమారు 50 రోజుల తర్వాత సెప్టెంబర్ 12- 13 తేదీల్లో చంద్రుడిపై అడుగుపెడుతుంది. కాగా ఈ గొప్ప ప్రయోగంపై అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తున్నాయి.

అయితే భారత క్రికెటర్ హర్బజన్ సింగ్ వినూత్నంగా దేశ గొప్పతనాన్ని చాటారు. కొన్ని దేశపు జెండాలపై చందమామ గుర్తు ఉంటే..చందమామపైనే పలు దేశాలే జాతీయ జెండాలు ఎగురేస్తున్నాయంటూ చంద్రయాన్ 2 ని ఉటంకిస్తూ అదిరిపోయే ట్వీట్ చేశారు. ఏ దేశాల జాతీయ జెండాలపై చందమామ ఉంటుందో?..ఏ దేశాలు చందమామపై కాలుమోపాయో ఉదహరిస్తూ ఆ జెండాలను పోస్టు చేశాడు.

ముందుగా పాకిస్తాన్ ఆ తర్వాత టర్కీ, తునీసియా, లిబ్యా, అజెర్‌బైజన్, అల్జీరియా, మలేసియా, మాల్దీవులు, మౌరిటానియాలు తమ దేశపు జెండాలపై చంద్రుడితో కూడిన గుర్తు ఉంచుకుంటాయి. వాటితో పాటు రెండో  సెంటెన్స్‌లో అమెరికా, రష్యా, ఇండియా, చైనాలు చంద్రుడిపై జెండా ఎగరేశాయంటూ తెలిపాడు. భజ్జీపై ట్వీట్‌పై తీవ్ర దుమారం చెలరేగుతుంది. కేవలం పాక్‌పైనే కాకుండా పలు దేశాల కూడా ఇన్వాల్వ్ చేసి ఈ తరహ వ్యాఖ్యలు సరికాదంటున్నారు నెటిజన్లు. దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.