అమెరికాలో రైలు ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసి.. కన్నీరుమున్నీరువుతోన్న తల్లిదండ్రులు.

|

Dec 24, 2020 | 1:47 PM

అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో హన్మకొండకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి రైలు ప్రమాదంలో మరణించాడు. గత మంగళవారం (డిసెంబర్22) న్యూజెర్సీలోని ఎడిసన్ టౌన్‌షిప్ నుంచి న్యూయార్క్‌లోని...

అమెరికాలో రైలు ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసి.. కన్నీరుమున్నీరువుతోన్న తల్లిదండ్రులు.
Follow us on

Hanamkonda man died in US by train accident: అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో హన్మకొండకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి రైలు ప్రమాదంలో మరణించాడు. గత మంగళవారం (డిసెంబర్22) న్యూజెర్సీలోని ఎడిసన్ టౌన్‌షిప్‌లో ఉన్న తన నివాసం నుంచి న్యూయార్క్‌లో ఉన్న ఆఫీసుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎడిసన్‌కు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌లో ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యాడు. నార్త్ ఈస్ట్ కారిడార్ రైలును ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
ప్రవీణ్ గత ఐదేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు. ప్రవీణ్ ఫార్మాసీ రంగానికి చెందిన ఓ అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నాడని అతని తండ్రి రాజమౌళి తెలిపారు. ప్రవీణ్ భార్య నవతతో కలిసి అమెరికాలో నివసిస్తున్నాడు, వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారుడి మృతి వార్త తెలిసి అతడి తల్లిదండ్రులు రాజమౌళి, పుష్పలీల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్ మృతదేహాన్ని ప్రస్తుతం న్యూ జెర్సీలోని మిడిలెస్సెక్స్ రీజనల్ ఎగ్జామినర్‌లో ఉంచారు. కేటీఆర్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడి ప్రవీణ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు రప్పిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.