చంద్రబాబు ఓటమి తథ్యం- జీవీఎల్

ఎన్నికల్లో ఓడిపోతున్న విషయం చంద్రబాబుకు అర్థమైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. అందుకే తన ఓటమిని ఎన్నికల కమీషన్ మీద నెట్టి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలు పని చేయడం లేదని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేశారని ధ్వజమెత్తారు. ఈవీఎంలలో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు సహజమని, వాటిని వెంటనే ఎన్నికల కమిషన్ సరిదిద్దిందని తెలిపారు.  రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని […]

చంద్రబాబు ఓటమి తథ్యం- జీవీఎల్

Edited By:

Updated on: Apr 12, 2019 | 4:17 PM

ఎన్నికల్లో ఓడిపోతున్న విషయం చంద్రబాబుకు అర్థమైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. అందుకే తన ఓటమిని ఎన్నికల కమీషన్ మీద నెట్టి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలు పని చేయడం లేదని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేశారని ధ్వజమెత్తారు. ఈవీఎంలలో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు సహజమని, వాటిని వెంటనే ఎన్నికల కమిషన్ సరిదిద్దిందని తెలిపారు.  రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు.  చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. టీడీపీ దారుణంగా ఓడిపోబోతుందని ఆయన జోస్యం చెప్పారు. పోలింగ్ శాతం పెరగడం ద్వారా ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న విషయం అర్థమవుతోందన్నారు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ అని, ఎన్నికల సంఘం ఎవరి మాట వినదని అన్నారు. నరేంద్ర మోడీ మాట ఎన్నికల కమిషన్ విన్నట్లయితే మోడీ బయోపిక్ విడుదలను ఎందుకు నిలుపుదల చేస్తోందని జీవీఎల్ ప్రశ్నించారు.