
గాంధీజీ హంతకుడైన గాడ్సేకు కూడా ఓ ఫ్యాన్ క్లబ్ ఉందని తనకు తెలీదని బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా వ్యాఖ్యానించారు. బాపును చంపడాన్ని ఇంకా కొందరు సమర్ధిస్తుంటే తనకు ఆశ్చర్యంగా ఉందని ఆమె అన్నారు. దీని బట్టి చూస్తుంటే భవిష్యత్‌లో మన పిల్లలు మన దేశ చరిత్రనే నమ్మరని.. ఈ పరిస్థితులను చూస్తుంటే భయంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు గుత్తా జ్వాలా.
Never knew there was a GODSE FAN CLUB ??
So many justifying his actions!!
It’s literally telling us and the children of our country not to believe our history..what we were taught!!
This is damn scary! ? #Election2019 #hittingnewlow— Gutta Jwala (@Guttajwala) May 18, 2019
కాగా స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని.. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే మొదటి ఉగ్రవాది అంటూ కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పలువురు ఖండించగా.. బీజేపీ నేతలు ప్రజ్ఙా సాధ్వీ సింగ్ గాడ్సేను దేశభక్తుడంటూ పొగిడారు. అలాగే కేంద్రమంత్రి హెగ్డే, కర్ణాటక నేత నలిన్ కుమార్‌లు గాడ్సేను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే.