తెలుగురాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు టెక్నాలజీని అందిపుచ్చుకుని ఎన్నో రకాల రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ క్రైమ్స్ ఆగడంలేదు. అందులోనూ గన్ కల్చర్ కు అడ్డుకట్ట పడ్డంలేదు. అయితే, గన్ కల్చర్ తెలంగాణలో కంటే ఆంధ్రాలోనే అధికంగా కనిపిస్తోంది. ఈ దాడుల్లో ప్రాణాలొదిన వాళ్లు, తృటిలో తప్పించుకుని గాయాలతో బయటపడ్డవాళ్లు కూడా ఉన్నారు. బాధితుల్లో కొందరు వివిధ ప్రభుత్వరంగ ఉద్యోగులతోపాటు, సాధారణ ప్రజానీకం కూడా తుపాకీ తూటాలకు బలయ్యారు. గతపదేళ్లలో ఎన్నడూ లేనంతగా 2020వ సంవత్సరంలో రికార్డు స్థాయిలో తుపాకీ కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం విశేషం. 1991 లగాయితూ 2020 వరకూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలు ఈ విధంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో :
> 1991 విజయవాడ పుష్పా హోటల్ సెంటర్‌లో ఇంటెలిజెన్స్ ఎస్‌ఐ ఇమ్మానియేల్ రాజు కాల్చివేత
> 1998 మొగల్రాజపురం సిటీ కేబుల్ ఎండి పొట్లూరి రామకృష్ణను దుండగులు కాల్చివేత
> 1999 విజయవాడలో సర్జికల్ వ్యాపారి కాటంరాజు లక్ష్మీనారాయణను కాల్చివేత
> 2001 విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్డులో తుపాకీ కాల్పులు. ఎవరూ గాయపడలేదు
> 2004 విజయవాడ బృందావన్ కాలనీలో టిడిపి నేత కాట్రగడ్డ బాబుపై ఆయన ఇంట్లోనే కొందరు యువకులు కాల్పులు, తప్పిన ప్రాణాపాయం
> 2006 విజయవాడ కోర్టుల వద్ద వంగవీటి శంతన్‌కుమార్‌పై కాల్పులు, కారు డ్రైవర్ మృతి. దీని వెనక బిహారీ కిరాయి ముఠా పాత్ర.
> 2014 సెప్టెంబరు గన్నవరం వద్ద కారులో వెళ్తున్న పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమికి చెందిన గంధం మారయ్య, పగిడి వీరయ్య, వారి తండ్రి నాగేశ్వరరావుపై బీహార్ గ్యాంగ్ కాల్పులు, మృతి
> 2014 అక్టోబరు నందిగామలో వైసీపీ నేత బొగ్గవరపు శ్రీశైలవాసు పై సినీ ఫక్కీలో తుపాకీతో కాల్పులు, బైక్ పై పరారీ
> 2017 జూలై తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నర్సాపురం గ్రామానికి చెందిన గిరిజనుడు భద్రందొర నాటు తుపాకీ పేలి మృతి
> 2020 అక్టోబర్ 11 పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పని చేసే మహేష్ అనే ఉద్యోగిని విజయవాడ-నున్న బైపాస్ రోడ్డులో నాటు తుపాకీతో కాల్చి చంపి, పరారీ
> 2020 నవంబర్ 5 నెల్లూరు ఫత్తేఖాన్ పేట వద్ద మహేంద్రసింగ్(47)అనే వ్యాపారిపై ఇద్దరు దుండగులు కాల్పులు. గాయాలు
> 2020 సెప్టెంబరు విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండలం గదబగలుగులో వన్యప్రాణుల వేట. ఒక బృందం పై మరో బృందం నాటు తుపాకీలతో కాల్పులు, బలరాం అనే గిరిజన యువకుడు మృతి
> 2020 ఏప్రిల్ కృష్టా జిల్లా మండవల్లిలోని తక్కెళ్లపాడులో నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మృతి
> 2020 ఫిబ్రవరి గుంటూరు చెరుకుపల్లి మండలం నడింపల్లికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన ఆర్మీ ఉద్యోగి. నిరాకరించడంతో యువతి పై కాల్పులు జరిపిన బాలాజీ, తృటిలో తప్పించుకున్న వైనం.
> 2020 డిసెంబర్ 11 విశాఖలో బిల్డర్ పిఎస్ ఎన్ రాజుకు తుపాకులు, మారణాయుధాలతో బెదిరింపు రౌడీ షీటర్ సంతోష్ కు సుపారీ ఆఫర్ చేసిన లోవరాజు, భయపడి దఫదఫాలుగా 9.8 లక్షలు ఇచ్చిన బిల్డర్ రాజు, ప్రామిసరీ నోట్లపై బలవంతంగా సంతకాలు, పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
తెలంగాణలో :
> 2014 నవంబరు హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా అధినేత నిత్యానందరెడ్డిపై ఏకే-47 తో కాల్పులు, తప్పిన ప్రాణాపాయం. అగంతకుడు గ్రేహౌండ్స్ మాజీ కానిస్టేబుల్
> 2015 సెప్టెంబరు జీడిమెట్లలోని ఉషోదయ టవర్స్ లో రాఘవశర్మ అనే వ్యక్తిపై తుపాకీతో కాల్పులు
> 2016 ఫిబ్రవరి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సెక్యూరిటీ గన్ నుంచి ప్రమాదవశాత్తు పేలుడు, డ్రైవర్ అక్బర్ మరణం.
> 2019 ఫిబ్రవరి జీడిమెట్ల దేవరయంజాల్లో అన్నదమ్ములు మహిపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి భూ పంచాయితీ. తన తుపాకీతో కాల్పులు జరిపిన వేణుగోపాల్ రెడ్డి
> 2019 మే పంజాగుట్ట వద్ద సిటీబస్సులో ప్రయాణీకుల మధ్య ఘర్షణ, తుపాకీతో కాల్పులు జరిపిన మరో వ్యక్తి. ఆర్టీసీ బస్సుకు చిల్లులు.
> 2020 ఫిబ్రవరి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేటలో ఓ పెళ్లి విందులో తిరుమల్ రెడ్డి అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గన్ తో గాల్లోకి కాల్పులు
> 2020 ఫిబ్రవరి సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో గంగరాజు పై సదానందం కాల్పులు, భూమి విషయంపై ఇరువురికి ఘర్షణ
> 2020 ఫిబ్రవరి జగిత్యాల జిల్లా గొల్లపల్లిమండలం ఇస్రాజ్ పల్లిలో భార్యను చంపేందుకు భర్త తుపాకీతో కాల్పులు, అడ్డొచ్చిన మేనమామరాజిరెడ్డికి తగిలిన బుల్లెట్లు, తీవ్రగాయం
ఏపీలో గత ఏడేళ్లలో పోలీసులు స్వాధీనం చేసుకున్న అక్రమ తుపాకులు (మావోయిస్టులు, సంఘ వ్యతిరేకశక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నవి కలిపి)
2013 – 48 (ఉమ్మడి రాష్ట్రంలో)
2014 – 37 (ఉమ్మడి రాష్ట్రంలో)
2015 – 57
2016 – 24
2017 – 48
2018 – 164
2019 – 49