మాస్కు ధరించకపోతే ఇక బాదుడే

|

Jun 15, 2020 | 2:13 PM

కరోనా కట్టడిలో భాగంగా గుజరాత్‌ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానా విధించే బాధ్యతను పోలీసులకు అప్పగించింది.

మాస్కు ధరించకపోతే ఇక బాదుడే
Follow us on

దేశంలో విస్తరిస్తున్న కరోనా కట్టడిలో భాగంగా గుజరాత్‌ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మాస్క్‌ ధరించని వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానా విధించే బాధ్యతను పోలీసులకు అప్పగించింది. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
రాష్ట్రంలో అహ్మదాబాద్‌తోపాటు పలు ప్రధాన నగరాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జనం మాత్రం మాస్కు లేకుండానే బయట తిరుగుతున్నా మున్సిపల్‌ సిబ్బంది, అధికారులు పట్టించుకోవడం లేదు. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న ప్రజల్లో మార్పు రావడంలేదు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చే వారు, జనసమర్ధం కలిగిన ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే రూ.200 జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు జరిమానా వసూలు చేసే బాధ్యత మున్సిపల్‌ అధికారులు నిర్వహిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా గుర్తించిన వారికి ఇప్పటి వరకు కేవలం 280 ఈ చలాన్లను అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జారీ చేసింది. ఇకపై మాస్కులు ధరించేలా తీసుకోవల్సిన బాధ్యతను పోలీసు శాఖ చేపట్టనుంది. మాస్క్‌లు ధరించని వారికి జరిమానా విధింపు, వసూళ్ల చేయనున్నారు.