కరోనా ఎఫెక్ట్: అహ్మ‌దాబాద్ ‘జగన్నాథ ర‌థ‌యాత్ర’ కూడా ర‌ద్దు!

| Edited By:

Jun 21, 2020 | 2:08 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ప్ర‌తీయేటా నిర్వ‌హించే జ‌గ‌న్నాథ

కరోనా ఎఫెక్ట్: అహ్మ‌దాబాద్ జగన్నాథ ర‌థ‌యాత్ర కూడా ర‌ద్దు!
Follow us on

Ahmedabad’s Rath Yatra: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ప్ర‌తీయేటా నిర్వ‌హించే జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌ను ఈ ఏడాది నిషేధించారు. ఇంత‌కుముందు ఒడిశాలోని పూరిలో నిర్వ‌హించే జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌ను ర‌ద్దుచేశారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం మేర‌కు జూన్ 23న అహ్మదాబాద్‌లో నిర్వ‌హించ‌బోయే జగన్నాథ‌ రథయాత్ర ర‌ద్దయ్యింది. విస్త‌రిస్తున్న కరోనా అంటువ్యాధి దృష్ట్యా గుజరాత్ హైకోర్టు ఈ మేర‌కు తీర్పు ఇచ్చింది.

వివరాల్లోకెళితే.. అహ్మ‌దాబాద్‌లో ప్ర‌తీయేటా 18 కిలోమీట‌ర్ల పొడ‌వున‌ నిర్వ‌హించే ర‌థ‌యాత్ర‌లో సుమారు 8 ల‌క్ష‌ల మంది భ‌క్తులు పాల్గొంటారు. ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పూరిలో రథయాత్రను అనుమతించలేమని చీఫ్ జస్టిస్ ఎస్‌ఐ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ సంవత్సరం రథయాత్రకు అనుమతిస్తే ఆ జగన్నాథుడు త‌మ‌ను క్షమించడ‌ని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇదిలావుండ‌గా అహ్మదాబాద్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య‌ 18 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 306 కరోనా కేసులు నమోదుకాగా, 16 మంది మృతి చెందారు.