బడ్జెట్ తర్వాత తొలి జీఎస్టీ భేటీ నేడే

| Edited By:

Jul 27, 2019 | 11:30 AM

గురువారం వాయిదా పడ్డ 36వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఆధ్వర్యంలో ఈ భేటీ కానుంది. గురువారమే జరగాల్సిన ఈ భేటీ.. ఆర్థిక మంత్రికి తీరిక లేని కారణంగా నేటికి వాయిదా పడింది. ఇవాళ జరగనున్న ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభ్యులతో మాట్లాడనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరగనున్న తొలి జీఎస్టీ మండలి భేటీ ఇదే కావడం విశేషం. ఈ సమావేశంలో విద్యుత్తు […]

బడ్జెట్ తర్వాత తొలి జీఎస్టీ భేటీ నేడే
Follow us on

గురువారం వాయిదా పడ్డ 36వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఆధ్వర్యంలో ఈ భేటీ కానుంది. గురువారమే జరగాల్సిన ఈ భేటీ.. ఆర్థిక మంత్రికి తీరిక లేని కారణంగా నేటికి వాయిదా పడింది. ఇవాళ జరగనున్న ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభ్యులతో మాట్లాడనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరగనున్న తొలి జీఎస్టీ మండలి భేటీ ఇదే కావడం విశేషం. ఈ సమావేశంలో విద్యుత్తు వాహనాలు, సోలార్ పవర్ ప్రాజెక్టులపై పన్ను తగ్గింపు, లాటరీలపై జీఎస్టీ రేట్ల సవరణ వంటి నిర్ణయాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే బడ్జెట్‌లో విద్యుత్ వాహనాలపై అనేక రాయితీలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు వాహనాలపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గిస్తారని అంతా భావిస్తున్నారు.