
పెళ్లి అంటే రెండు నిండు జీవితాలు కలిసి ముందుకు వెళ్లడం. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక. పెళ్లి అంటే విడదీయరాని బంధం. పెళ్లి అంటే మరో కొత్త జీవితం. అయితే ఇటీవలి కాలంలో పెళ్లిళ్లు కామెడీ అయిపోయాయి. అడిగినంత కట్నం ఇవ్వకపోతే పీటలపైనే పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. పెళ్లైన కొన్ని రోజుల్లోనే ఈగోలతో వివాహా బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇవి చాలా పెద్దవి ఇంతకంటే చిన్న కారణాలకే చేతులారా కాపురాలను కూల్చుకుంటున్నారు. తాజాగా పెళ్లైన 10 నిమిషాలకే వరుడు కనిపించడకుండా మాయమయ్యాడు. అసలు సమస్య ఏంటా అని ఆరా తీస్తే విషయం వెలుగులోకి వచ్చింది. ( తమ్ముని పేరుతో అన్న ప్రభుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు)
అత్తింటి వాళ్లు బంగారం పెట్టలేదనే కోపంతో సదరు మహానుభావుడు అక్కడ్నుంచి నిష్క్రమించాడట. ఈ ఘటన కదిరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..తలుపుల మండలం ఓబులరెడ్డి పల్లికి చెందిన చిన్న అనే యువకుడికి, కదిరి పట్టణంలో నివశించే అతడి అక్క కూతురుతోనే వివాహాన్ని కుదిర్చారు పెద్దలు. శుక్రవారం బంధుమిత్రలను పిలిచి ఓ ఆలయంలో వివాహం కూడా జరిపించారు. అయితే వరుడికి మూడు తులాల బంగారం పెడతామని చెప్పిన వధువు తల్లిదండ్రులు ఆర్థిక సమస్యలు వల్ల పెట్టలేకపోయారు. దీంతో అతడు అక్కడ్నుంచి జంప్ అయ్యారు. అంతేకాదు తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారని పోలీసులకు ముందుగానే ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వరుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. (కడపజిల్లాలో ఎస్ఐ సాహసం, ప్రాణాలకు తెగించి)