Grenade bomb in Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రనేడ్ బాంబు కలకలం, హడలిపోతోన్న స్థానికులు..టీవీ9 సాహసోపేత కవరేజ్

Grenade bomb in Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రనేడ్ బాంబు ఒక్కసారిగా కలకలం రేపింది. మహబూబ్ నగర్ పట్టణానికి కూతవేటు దూరంలోని గుట్టలల్లో ఓ పెద్ద గ్రనేడ్ కనిపించింది. ఉదయం పశువులు..

Grenade bomb in Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రనేడ్ బాంబు కలకలం, హడలిపోతోన్న స్థానికులు..టీవీ9 సాహసోపేత కవరేజ్
Follow us

|

Updated on: Mar 01, 2021 | 12:41 PM

Grenade bomb in Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రనేడ్ బాంబు ఒక్కసారిగా కలకలం రేపింది. మహబూబ్ నగర్ పట్టణానికి కూతవేటు దూరంలోని గుట్టలల్లో ఓ పెద్ద గ్రనేడ్ కనిపించింది. ఉదయం పశువులు మేపేందుకు‌వచ్చిన వారికి గ్రనేడ్ కనిపించడంతో స్థానిక‌ సర్పంచ్ కు సమాచారం అందించారు. ఈ ప్రాంతంలో కి గ్రనేడ్ ఎలా వచ్చింది. ఇలాంటివి ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ క్రమంలో టీవీ9 సాహసోపేతంగా వ్యవహరించి గ్రనేడ్ దృశ్యాలను చిత్రీకరించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అధికారులు హుటాహుటీన రంగంలోకి దిగారు. అయితే, స్థానికులు మాత్రం గ్రనేడ్ ఎక్కడ పేలుతుందో, స్థానికంగా ఇంకెక్కడయినా బాంబులు ఉన్నాయేమోనని హడలి పోతున్నారు.

Read also : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన క్యాన్సిల్‌ . ఈ నెల 4,5 తేదీల్లో జరగాల్సిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం వాయిదా