విషాదం : నానమ్మ మృతి చెందిన కొన్ని గంటల్లోనే మ‌న‌వ‌డి మ‌ర‌ణం

విజయనగరం జిల్లా శృంగవరపుకోట గౌరీశంకర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నాన్నమ్మ మృతి చెందిన గంటల్లోనే మనవడు ప్రాణాలు విడిచాడు.

విషాదం : నానమ్మ మృతి చెందిన కొన్ని గంటల్లోనే మ‌న‌వ‌డి మ‌ర‌ణం

Updated on: Aug 29, 2020 | 6:10 PM

విజయనగరం జిల్లా శృంగవరపుకోట గౌరీశంకర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నాన్నమ్మ మృతి చెందిన గంటల్లోనే మనవడు ప్రాణాలు విడిచాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. శృంగవరపుకోట గౌరీశంకర్ కాలనీలో వి.కాసులమ్మ(90) అనారోగ్య కార‌ణాల‌తో అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో త‌నువు చాలించింది. మూగ చెవుడుతో ఉన్న ఆమె మనవడు వీరాచారి(40)…త‌న నాన‌మ్మ‌ మృతదేహం వద్ద ఏడుస్తూ ఉదయం 5 గంటల ప్రాంతంలో చ‌నిపోయాడు. ఇంట్లో మరో మనవడు జ్వరంతో బాధ‌ప‌డుతుండ‌టంతో… కరోనా భయంతో ఎవ‌రూ వాళ్ల వ‌ద్ద‌కు వెళ్ల‌డానికి సాహసించలేదు.

ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి కార్యాలయం స్పందించింది. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. ఇద్దరివీ కరోనా మరణాలు కావని అధికారులు నిర్ధారించారు. కుటుంబ సంప్రదాయాల మేరకు అంత్యక్రియలు నిర్వహించిన‌ట్లు తెలిపారు. మిగతా 8 మంది కుటుంబసభ్యులకు కొవిడ్ టెస్టుల‌ చేయిస్తామని..పరీక్షల రిపోర్ట్స్ వ‌చ్చిన‌ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ మేరకు సీఎంవో ఆఫీసుకు ఎస్.కోట తహసీల్దార్ నివేదిక పంపారు.

 

Also Read :

తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు

కడపజిల్లాలో ఎస్ఐ సాహసం, ప్రాణాల‌కు తెగించి

Loading...
Unable to load recommendations.
Follow Us