EPS pensioners : పీఎఫ్‌‌ పెన్షనర్లకు శుభవార్త…

ఈపీఎఫ్‌‌ఓ పెన్షన్లు తీసుకునేవారికి ఇది నిజంగా శుభవార్తే. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద ఉద్యోగులు ఎవరైతే రిటైర్‌‌‌‌మెంట్ సమయంలో కమ్యుటేషన్‌‌ను ఎంపిక చేసుకున్నారో... వారికి 15 ఏళ్ల తర్వాత ఫుల్ పెన్షన్ వచ్చేలా కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది.

EPS pensioners : పీఎఫ్‌‌ పెన్షనర్లకు శుభవార్త...
Follow us

|

Updated on: Feb 25, 2020 | 9:00 PM

EPS pensioners :  ఈపీఎఫ్‌‌ఓ పెన్షన్లు తీసుకునేవారికి ఇది నిజంగా శుభవార్తే. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద ఉద్యోగులు ఎవరైతే రిటైర్‌‌‌‌మెంట్ సమయంలో కమ్యుటేషన్‌‌ను ఎంపిక చేసుకున్నారో… వారికి 15 ఏళ్ల తర్వాత ఫుల్ పెన్షన్ వచ్చేలా కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. తాజా నిర్ణయంతో 6.3 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. 2008 సెప్టెంబర్ 26కు ముందు ఎవరైతే రిటైర్ అయ్యారో, వారు కమ్యుటేషన్‌‌ను ఎంపిక చేసుకుని ఉంటే ఈ ప్రయోజనం దక్కుతుంది. ఈపీఎస్ రూల్స్ ప్రకారం..2008 సెప్టెంబర్ 26 కంటే ముందు రిటైర్ అయ్యారో, వారికి మొత్తం అమౌంట్‌లో మూడింట ఒక వంతు పూర్తిగా వస్తుంది. మిగిలిన రెండొంతులను నెలవారీ పింఛన్‌గా ఉద్యోగులకు వారి లైఫ్ టైమ్ ఇస్తారు. అయితే ఇక్కడ పెన్షన్ మొత్తం తగ్గుతుంది.

ప్రస్తుత ఈపీఎఫ్‌‌ రూల్స్ ప్రకారం… ఈపీఎఫ్‌‌ఓ సభ్యులు కమ్యుటేషన్ ప్రయోజనం పొందేందుకు అవకాశం లేదు. 2020 ఫిబ్రవరి 20(గురువారం) జారీ చేసిన కొత్త నోటిఫికేషన్‌‌లో.. 15 ఏళ్ల తర్వాత పూర్తి పెన్షన్ పొందే అవకాశాన్ని మళ్లీ ప్రవేశపెట్టారు. అందువల్ల, ఏప్రిల్ 1, 2005 న పదవీ విరమణ చేసిన వ్యక్తి 15 సంవత్సరాల తరువాత..అంటే 2020 ఏప్రిల్ 1 నుండి అధిక పెన్షన్ ప్రయోజనాన్ని పొందటానికి అర్హులు అవుతారు. 

ఇది కూడా చదవండి : ‘తలైవి’లో శశికళగా ఆ హీరోయిన్..!