కొబ్బరిపీచుతో గ్రామీణ రోడ్లు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రయోగం

దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి సడక్‌ యోజన రోడ్లలో జౌళి, కొబ్బరిపీచు (జియోటెక్స్‌టైల్‌)తో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త విధానంలో పర్యావరణానికి అనుకూలంగా, తక్కువ వ్యయంతో..

  • Tv9 Telugu
  • Publish Date - 7:56 am, Thu, 21 May 20
కొబ్బరిపీచుతో గ్రామీణ రోడ్లు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రయోగం

దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి సడక్‌ యోజన రోడ్లలో జౌళి, కొబ్బరిపీచు (జియోటెక్స్‌టైల్‌)తో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త విధానంలో పర్యావరణానికి అనుకూలంగా, తక్కువ వ్యయంతో మన్నికైన రోడ్లను నిర్మించవచ్చని అంచనా వేసింది. రహదారులను నిర్మాణంలో ఈ విధానాన్ని పైలట్‌ ప్రాతిపదికన ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో 164 కిలోమీటర్లు, తెలంగాణలో 121 కిలోమీటర్ల మేర రహదారులను ఈ కొత్త టెక్నాలజీ ద్వారా చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ పేర్కొంది. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 1,674 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణంలో కొబ్బరి పీచుపట్టాలను ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

గతంలో కర్ణాటక, కేరళ, తమిళనాడులో సమర్థవంతంగా కొబ్బరి పీచుపట్టాలను ఉపయోగించి రోడ్లను నిర్మించారు. అక్కడ రోడ్లు, కాలువల లైనింగుల్లో జియోటెక్స్‌టైల్‌ ఉపయోగించ వచ్చని ఆయా రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా విజయవంతం చేశారు