మాజీ ప్రధానికి ఇక జడ్‌ ప్లస్ సెక్యూరిటీ మాత్రమే

| Edited By: Pardhasaradhi Peri

Aug 26, 2019 | 5:24 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కేంద్రం భద్రతను కుదించింది. ఇప్పటి వరకు ఆయనకు ఉన్న ప్రత్యేక భద్రతా బృందం (ఎస్పీజీ)ని వెనక్కి తీసుకుంది. దీంతో ఇప్పుడు ఆయనకు జడ్‌ ప్లస్ భద్రతను కేటాయిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఎస్పీజీ భద్రతపై సమీక్ష చేపట్టిన అనంతరం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్పీజీ హోదా ప్రధాని మోదీకి, కాంగ్రెస్ జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ […]

మాజీ ప్రధానికి ఇక జడ్‌ ప్లస్ సెక్యూరిటీ మాత్రమే
Follow us on

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కేంద్రం భద్రతను కుదించింది. ఇప్పటి వరకు ఆయనకు ఉన్న ప్రత్యేక భద్రతా బృందం (ఎస్పీజీ)ని వెనక్కి తీసుకుంది. దీంతో ఇప్పుడు ఆయనకు జడ్‌ ప్లస్ భద్రతను కేటాయిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఎస్పీజీ భద్రతపై సమీక్ష చేపట్టిన అనంతరం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్పీజీ హోదా ప్రధాని మోదీకి, కాంగ్రెస్ జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులకు కొనసాగుతోంది. సెక్యూరిటీ ఏజెన్సీల నివేదికల సూచనలకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఎస్పీజీ సెక్యూరిటీ తగ్గించామని.. జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని హోం శాఖ పేర్కొంది.

కాగా, 2014 వరకు మన్మోహన్‌ సింగ్ సతీమణి గురశరణ్‌ సింగ్‌, కుమార్తెలకు కూడా ఎస్పీజీ హోదా ఉండేది. అయితే తమకు ఎలాంటి భద్రతా అవసరం లేదని మన్మోహన్ కుమార్తెలు స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశారు. అయితే ఇలా మాజీ ప్రధానుల ఎస్పీజీ సెక్యూరిటీని వెనక్కి తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మాజీ ప్రధానులైన హెచ్‌డీ దేవెగౌడ, వీపీ సింగ్‌ల విషయంలోనూ ఇలాగే జరిగింది. అయితే వాజ్‌పేయీకి మాత్రం ఆయన మరణించే వరకూ ఎస్పీజీ భద్రత కొనసాగింది. ఆయన దత్త పుత్రికకూ కూడా సెక్యూరిటీ కొనసాగించారు. మాజీ ప్రధాని ఇందిరా హత్య తర్వాత ఈ ఎస్పీజీని తీసుకొచ్చారు.