Breaking News: ‘గాంధీ’ వ్యవహారాలపై సర్కార్ సీరియస్

|

Feb 15, 2020 | 5:15 PM

Health minister Etala Rajendar anger over Gandhi hospital incidents: కరోనా వైరస్‌పై యావత్ ప్రపంచం పోరాడుతుంటే.. సీరియస్‌గా తీసుకోవాల్సిన గాంధీ ఆసుప్రతి వర్గాలు గిల్లికజ్జాలతో చీప్‌గా మారిన వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై విచారణ జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తోంది. శనివారం కరోనా వ్యాధి నివారణ చర్యలపై సమీక్ష జరిపి రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆసుపత్రి వ్యవహారాలపై ఆగ్రహం […]

Breaking News: గాంధీ వ్యవహారాలపై సర్కార్ సీరియస్
Follow us on

Health minister Etala Rajendar anger over Gandhi hospital incidents: కరోనా వైరస్‌పై యావత్ ప్రపంచం పోరాడుతుంటే.. సీరియస్‌గా తీసుకోవాల్సిన గాంధీ ఆసుప్రతి వర్గాలు గిల్లికజ్జాలతో చీప్‌గా మారిన వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై విచారణ జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తోంది.

శనివారం కరోనా వ్యాధి నివారణ చర్యలపై సమీక్ష జరిపి రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆసుపత్రి వ్యవహారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తులకంటే వ్యవస్థే ముఖ్యమన్న వాస్తవాన్ని గుర్తించాలని ఈటల అన్నారు. నిజానిజాలు వెలికి తీసి… బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు మంత్రి ఈటల. కీలకమైన అంశాల్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారని ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.

అటెండెన్స్‌కి సంబంధించి ఇక మీదట సూపరింటెండెంట్‌కు అధికారాలు లేకుండా చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. భోదనా ఆస్పత్రుల్లో మెరుగైన సేవల కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటించి స్టడీ చేయాలని ఆయన వైద్య, ఆరోగ్య శాఖాధికారులకు సూచించారు.

కరోనా వైరస్ వ్యాపించకుండా నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా… గాంధీ ఆసుపత్రిలో వైద్య వర్గాలు పరస్పరం పోట్లాడుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం ఓ డాక్టర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఘటన తర్వాత పలు సంఘటలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సమీక్ష నిర్వహించిన ఈటల… పరిణామాలపై విచారణకు ఆదేశించారు.