AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS vs BJP: టీఆర్ఎస్, బీజేపీల మాటల యుద్ధం… వేదిక ఇదే

War of words between TRS & BJP: తెలంగాణలో అధికార పార్టీతో కేంద్రంలో అధికార పార్టీ మాటల యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. కేంద్రం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని టీఆర్ఎస్ నేతలు అంటుంటే.. కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ మాటల యుద్ధానికి సోషల్ మీడియా వేదికైంది. సోషల్ మీడియాలో నిధుల వార్‌ మొదలైంది. గులాబీ, కమలం మధ్య వర్చువల్‌ ఫైట్‌ జరుగుతోంది. లెక్కలు, ఎక్కాలు అన్ని వివరాలతో ట్వీట్ల […]

TRS vs BJP: టీఆర్ఎస్, బీజేపీల మాటల యుద్ధం... వేదిక ఇదే
Rajesh Sharma
|

Updated on: Feb 15, 2020 | 4:53 PM

Share

War of words between TRS & BJP: తెలంగాణలో అధికార పార్టీతో కేంద్రంలో అధికార పార్టీ మాటల యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. కేంద్రం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని టీఆర్ఎస్ నేతలు అంటుంటే.. కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ మాటల యుద్ధానికి సోషల్ మీడియా వేదికైంది.

సోషల్ మీడియాలో నిధుల వార్‌ మొదలైంది. గులాబీ, కమలం మధ్య వర్చువల్‌ ఫైట్‌ జరుగుతోంది. లెక్కలు, ఎక్కాలు అన్ని వివరాలతో ట్వీట్ల మీద ట్వీట్లు పోస్టు అవుతున్నాయి. దీంతో ఈ ఫైట్‌ చివరకు ఎటూ దారితీస్తుందో అనే చర్చ జరుగుతోంది.

కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులపై ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ఓ యుద్దం జరుగుతోంది. ఆరేళ్లలో తెలంగాణకు 85 వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటు వేదికగా వెల్లడించారు.

తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందని…. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్‌లో ప్రశ్నించారు. గత ఆరేళ్లలో 85 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు లెక్కలు చెప్పారు. ఈ లెక్కలపై ఇప్పుడు సోషల్‌ మీడియాలో బీజేపీని టీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేసింది. కేంద్రం నుండి తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన వాటాపై సోషల్‌ మీడియాలో టీఆర్‌ఎస్‌ డైరెక్టు అటాక్‌కు దిగింది.

Also read: Pawan Kalyan to announce new action plan for Amaravati

కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం జరిగిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. తాము కట్టిన పన్నుల్లో సగం కూడా తమకు ఇవ్వడం లేదని దుమ్మెత్తిపోశారు. దీంతో ఆయన బాటలోనే గులాబీ సోషల్‌ సైనికులు ఇప్పుడు బీజేపీ టార్గెట్‌గా పోస్టులు పెడుతున్నారు. వరుస కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

తెలంగాణ నుండి కేంద్రానికి వెళ్తున్న నిధులు…కేంద్రం నుండి తెలంగాణ వస్తున్న నిధులను పోలుస్తూ ట్విట్టర్‌లో బీజేపీ నేతలకు ప్రశ్నలు సంధిస్తున్నారు. కేవలం కేంద్రాన్ని ప్రశ్నించడం కాకుండా రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీత రామన్‌ను ఉద్దేశించి కేటీఆర్ పెట్టిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్‌తో పాటు మిగతా టిఆర్ ఎస్ నాయకత్వం కూడా బీజేపీపై అటాక్ మొదలు పెట్టడంతో రాష్ట్ర బీజేపీ అదే వేదికగా తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. బీజేపీ కూడా టీఆర్‌ఎస్‌కు కౌంటర్లు ఇస్తోంది. రాష్ట్రం అంత పక్కన పెట్టి కేవలం చింతమడకకు ఎలా ప్రత్యేకంగా నిధులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.