హత్య చేశాడు.. జైలుకెళ్లాడు… పంతాన్ని నెరవేర్చుకున్నాడు..!

కర్నాటకలోని కాలబుర్గికి చెందిన సుభాష్‌ పాటిల్‌కు ఒకే ఒక్క లక్ష్యం.. అది డాక్టర్‌ కావలన్నది..! ఆ లక్ష్యసాధన కోసం ఎంతో కష్టపడ్డాడు… ఎంట్రన్స్‌లో పాసై మొత్తానికి మెడిసిన్‌లో సీటు సంపాదించాడు.. వైద్యవృత్తిలో స్థిరపడాలన్న ఆశయంతో బాగా చదవసాగాడు.. అదే టైమ్‌లో ఇంటిపక్కన ఉండే పద్మావతి అనే మహిళ ప్రేమలో పడ్డాడు సుభాష్‌… కాకపోతే ఆమెకు అప్పటికే పెళ్లయింది.. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం భర్తకు తెలిసింది… ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా ఇద్దరిని హెచ్చరించాడు.. ఆవేశంలో ఆమె భర్తను చంపేశాడు […]

హత్య చేశాడు.. జైలుకెళ్లాడు... పంతాన్ని నెరవేర్చుకున్నాడు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 15, 2020 | 4:37 PM

కర్నాటకలోని కాలబుర్గికి చెందిన సుభాష్‌ పాటిల్‌కు ఒకే ఒక్క లక్ష్యం.. అది డాక్టర్‌ కావలన్నది..! ఆ లక్ష్యసాధన కోసం ఎంతో కష్టపడ్డాడు… ఎంట్రన్స్‌లో పాసై మొత్తానికి మెడిసిన్‌లో సీటు సంపాదించాడు.. వైద్యవృత్తిలో స్థిరపడాలన్న ఆశయంతో బాగా చదవసాగాడు.. అదే టైమ్‌లో ఇంటిపక్కన ఉండే పద్మావతి అనే మహిళ ప్రేమలో పడ్డాడు సుభాష్‌… కాకపోతే ఆమెకు అప్పటికే పెళ్లయింది.. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం భర్తకు తెలిసింది… ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా ఇద్దరిని హెచ్చరించాడు.. ఆవేశంలో ఆమె భర్తను చంపేశాడు సుభాష్‌.. ఇందుకు పద్మావతి కూడా సహకరించింది… ఈ కేసులో సుభాష్‌, పద్మావతి దోషులుగా తేలారు.. కోర్టు వారికి జీవితఖైదు విధించింది.

అప్పటికీ ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు సుభాష్‌.. 14 ఏళ్ల తర్వాత సత్ర్పవర్తన కారణంగా నాలుగేళ్ల కిందట జైలు నుంచి విడుదలయ్యాడు సుభాష్‌.. డాక్టరవ్వాలన్న పంతాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు.. తాను మధ్యలో వదిలేసిన మెడిసిన్‌ కోర్సును కొనసాగించాలనుకున్నాడు.. యూనివర్సిటీకి విన్నవించుకున్నాడు.. లీగల్‌గా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలుసుకున్నాక యూనివర్సిటీ కూడా ఓకే చెప్పేసింది… దీంతో 2016లో సుభాస్‌ మళ్లీ ఎంబీబీఎస్‌లో చేరాడు.. లాస్టియర్‌ డాక్టర్‌ పట్టా పుచ్చుకున్నాడు.. ఇంటర్న్‌షిప్‌ కూడా కంప్లీటయ్యింది.. ఇక పూర్తిస్థాయి డాక్టర్‌గా సేవలందించడమే మిగిలింది.

[svt-event date=”15/02/2020,4:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]