Telugu News Latest Telugu News Government of india issued new guidelines for officials of central government to prevent spread of covid 19
కరోనా: ప్రభుత్వ ఉద్యోగులకు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..
దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా చాలామంది కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది వైరస్ కారణంగా ప్రాణాలు కూడా విడిచారు. ఈ నేపధ్యంలోనే కేంద్రం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వీటిని ఖచ్చితంగా పాటించాలని సూచించింది. ఎటువంటి లక్షణాలు లేనివారు మాత్రమే ఆఫీసులకు వచ్చేందుకు అనుమతించాలి. […]
దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా చాలామంది కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది వైరస్ కారణంగా ప్రాణాలు కూడా విడిచారు. ఈ నేపధ్యంలోనే కేంద్రం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వీటిని ఖచ్చితంగా పాటించాలని సూచించింది.
ఎటువంటి లక్షణాలు లేనివారు మాత్రమే ఆఫీసులకు వచ్చేందుకు అనుమతించాలి. మోస్తరుగా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు ఇంటికే పరిమితం కావాలి.
కంటైన్మెంట్ జోన్/ లేదా ఆ చుట్టుపక్కల ఉంటున్న అధికారులు ఎవ్వరూ కూడా ఆఫీసులకు రాకూడదు.
రోజుకు 20 మంది మాత్రమే ఆఫీసులకు రావాలి. మిగిలినవారు ‘వర్క్ ఫ్రం హోం’ చేయాలి.
ఆఫీసులకు వచ్చినవారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. లేదంటే వారిపై చర్యలు తీసుకోవాలి.
ఫేస్ టూ ఫేస్ మీటింగ్స్, డిస్కషన్స్ వంటివి.. వీడియో కాన్ఫరెన్స్, ఫోన్ ద్వారా పెట్టుకోవాలి.
ప్రతీ అరగంటకు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాకుండా ఆఫీసులోని ముఖ్యమైన ప్రదేశాల్లో హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
ఎలివేటర్ బటన్స్, హ్యాండ్ రైల్స్, వాష్ రూమ్ డోర్స్, ఎలక్ట్రిక్ స్విచ్స్ వంటి వాటిని ప్రతీ గంటకు 1% సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. అలాగే అధికారులు తరుచుగా వాడే ఏసీ రిమోట్స్, ఫోన్స్, కీ బోర్డులను కూడా శుభ్రపరుచుకోవాలి.
ప్రతీ వ్యక్తికి మధ్య 1 మీటర్ డిస్టెన్స్ ఉండేలా సీటింగ్ యారెంజ్‌మెంట్ చేయాలి.