గూగుల్ సంచలనం.. 2025 కల్లా లీడర్‌షిప్ స్థానాల్లో 30 శాతం వాళ్లే..

| Edited By:

Jun 18, 2020 | 10:59 PM

జాత్యహంకారం రూపుమాపే దిశగా దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2025కల్లా లీడర్‌షిప్ స్థానాల్లోని ఉద్యోగుల్లో నల్లజాతివారు ఇతర మైనారిటీ గ్రూపుల వారు కనీసం 30 శాతం ఉండేలా చూసేందుకు

గూగుల్ సంచలనం.. 2025 కల్లా లీడర్‌షిప్ స్థానాల్లో 30 శాతం వాళ్లే..
Follow us on

జాత్యహంకారం రూపుమాపే దిశగా దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2025కల్లా లీడర్‌షిప్ స్థానాల్లోని ఉద్యోగుల్లో నల్లజాతివారు ఇతర మైనారిటీ గ్రూపుల వారు కనీసం 30 శాతం ఉండేలా చూసేందుకు చర్యలు ప్రారంభించింది. అదే విధంగా సంస్థలో ప్రతేక జాత్యహంకారం నిరోధక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ విషయంలో ఉద్యోగులకు అవగాహన కల్పిస్తామని తెలిపింది.

సంస్థలో జరిపిన అంతర్గత సర్వే ప్రకారం కంపెనీ ఉద్యోగుల్లో నల్లజాతివారి శాతం 2014లో 2.4శాతంగా ఉంది. అయితే ఈ ఏడాదికి ఆ సంఖ్య 3.7శాతానికి పెరిగినట్టు తెలిసింది. అమెరికాలో జాత్యహంకార వ్యతిరేక నిరసనలు మిన్నుముడుతున్న నేపథ్యంలో ఇప్పటికే గూగుల్ వారి అభ్యున్నతి కోసం అనేక చర్యలు చేపట్టిన విషయం విదితమే.

Also Read: గురుకుల పాఠశాలల్లో.. లాటరీ పద్ధతిలో అడ్మిషన్లు..