ఇకపై పేదవారికి ఉచిత విద్యుత్.. ఎస్సి, ఎస్టీలకు నెలకు రూ.1000…

|

Feb 12, 2020 | 11:28 AM

Good News To Poor People: రాజకీయ నేతలలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వేరయా.. విశ్వదాభిరామ.. వినురా రామా.. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మాదిరిగానే ‘దీదీ’ అంటే రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్. రాష్ట్రంలో అధికారం చేపట్టాలని బీజేపీ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మమతా బెనర్జీ తనదైన మార్క్ రాజకీయాలతో దూసుకుపోతోంది. ఇక తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేదలకు వరాల జల్లు కురిపించింది. మమతా బెనర్జీ ప్రభుత్వం పేదవారికి ఉచిత విద్యుత్‌ను […]

ఇకపై పేదవారికి ఉచిత విద్యుత్.. ఎస్సి, ఎస్టీలకు నెలకు రూ.1000...
Follow us on

Good News To Poor People: రాజకీయ నేతలలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వేరయా.. విశ్వదాభిరామ.. వినురా రామా.. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మాదిరిగానే ‘దీదీ’ అంటే రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్. రాష్ట్రంలో అధికారం చేపట్టాలని బీజేపీ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మమతా బెనర్జీ తనదైన మార్క్ రాజకీయాలతో దూసుకుపోతోంది. ఇక తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేదలకు వరాల జల్లు కురిపించింది.

మమతా బెనర్జీ ప్రభుత్వం పేదవారికి ఉచిత విద్యుత్‌ను ప్రకటించింది. అయితే ఇది కేవలం 3 నెలల్లో 75 యూనిట్లు వినియోగించే వారికి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. అంతేకాకుండా దీని కోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ రూ. 2,55,000 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. ఎమ్‌ఎస్ఎమ్‌ఈ పార్కులు, ఉద్యోగల కల్పన కోసం సుమారు రూ.5,000 కోట్లను కేటాయించింది.

అటు ఎస్సి, ఎస్టీ వాళ్లకు కూడా పెన్షన్ స్కీంను ప్రవేశపెట్టింది దీదీ సర్కార్. ఇందులో భాగంగా వృద్దులకు ప్రతీనెలా రూ.1000 ఇవ్వనున్నారు. దీనికి ప్రభుత్వంపై రూ.3,000 వ్యయం పడనున్నట్లు తెలుస్తోంది. కాగా, పశ్చిమ బెంగాల్‌లో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే దీదీ సర్కార్ ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం విశేషం.