ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త!

| Edited By:

Jan 25, 2020 | 10:00 PM

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా టీఆరెస్‌కు ప్రజలు పట్టంకట్టారని తెలిపారు. ప్రజలందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా, పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని తెలిపారు కేసీఆర్. ఈక్రమంలో.. ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని పెంచుతామని స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 57 ఏళ్లు […]

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త!
Follow us on

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా టీఆరెస్‌కు ప్రజలు పట్టంకట్టారని తెలిపారు. ప్రజలందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా, పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని తెలిపారు కేసీఆర్.

ఈక్రమంలో.. ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని పెంచుతామని స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 57 ఏళ్లు దాటిన వాళ్లకు పెన్షన్‌ ఇస్తామని చెప్పామని.. మార్చి 31 నుంచి వృద్ధాప్య పెన్షన్లు అందజేస్తామన్నారు. ఈ బడ్జెట్‌లోనే నిధులు కూడా కేటాయిస్తామని కేసీఆర్ తెలిపారు.