విజయనగరం జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్

విజయనగరం జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ గుడ్  న్యూస్ చెప్పింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న బాధితులకు 4.5 కోట్ల రూపాయల మేర అదనపు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

విజయనగరం జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్
Follow us

|

Updated on: Oct 15, 2020 | 3:37 PM

విజయనగరం జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ గుడ్  న్యూస్ చెప్పింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న బాధితులకు 4.5 కోట్ల రూపాయల మేర అదనపు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 10 వేలు, అంత కంటే తక్కువ మొత్తాలను డిపాజిట్ చేసిన వారికి ఈ డబ్బును చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 10 వేల రూపాయల లోపు డిపాజిట్లు చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఈ 4.5 కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించాల్సిందిగా ప్రభుత్వం విజయనగరం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి సూచించింది. విశాఖ జిల్లాలో చెల్లింపుల అనంతరం మిగిలిన ఈ మొత్తాన్ని విజయనగరం జిల్లాకు బదిలీ చేయాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. త్వరలోనే జిల్లాలో పదివేలు అంతకంటే తక్కువ మొత్తాలను డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు జరుపనున్నారు. గతంలో కూడా ఈ జిల్లాకు కొంత డబ్బును కేటాయించిన ప్రభుత్వం..కొందరికి చెల్లింపులు జరిపింది.

Also Read :

దింపుడుకల్లం వద్ద పిలుపుకు స్పందన, ఆస్పత్రికి తీసుకెళ్తే..

ట్రాక్టర్‌ తిరగబడి కొడుకు మరణం, బాధ తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

తెలంగాణ : ఈ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం