Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ప్రధాన పట్టణాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి..
కొత్త సంవత్సరం ప్రారంభ రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా బుధవారం మధ్యాహ్నం పసిడి ధర స్వల్పంగా తగ్గింది.
కొత్త సంవత్సరం ప్రారంభ రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా బుధవారం పసిడి ధర స్వల్పంగా తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,250కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,860గా ఉంది. చెన్నై మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.53, 465కు చేరింది. ముంబయిలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.50,350 ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.50,060కు చేరింది. కరోనా సంక్షోభంతో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గడం లేదు. ఇప్పట్లో బంగారం ధరలు భారీగా తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు.
Also Read:
Buy Gold Jewellery : బంగారం కొనేందుకు వెళ్తున్నారా..? అయితే ఈ డాక్యుమెంట్స్ మరిచిపోవద్దు…