దేశీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. కరోనా ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారంతో పోల్చుకుంటే.. శనివారం పసిడి ధరలలో ఎలాంటి మార్పులు లేవు. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 47,800 దగ్గర ఉంది. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.48,800కు చేరింది.
అటు దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 ఉండగా.. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 దగ్గరగా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల పసిడి ధర రూ.45,800 దగ్గరగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.47,800కు చేరింది.