మరోసారి స్వల్పంగా తగ్గిన పసిడి ధర
దేశీయ మార్కెట్ పసిడి ధరలు గత కొద్దిరోజులుగా దోబుచులాడుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో గరిష్టస్థాయిని తాకిన బంగారం ధర తగ్గుతూ వచ్చింది.
దేశీయ మార్కెట్ పసిడి ధరలు గత కొద్దిరోజులుగా దోబుచులాడుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో గరిష్టస్థాయిని తాకిన బంగారం ధర తగ్గుతూ వచ్చింది. ఇక ప్రతిరోజు ఎంతో కొంత పెరుగుతూ, తగ్గతూ ఊగిసలాడుతోంది. తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.133 తగ్గి రూ.51,989కి చేరింది. గత మూడు ట్రేడింగ్‌లలో స్వల్పంగా పెరుగుతూ పోయిన బంగారం ధర మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్వల్పంగా తగ్గింది. గత ట్రేడ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,122 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌ను పరిశీలిస్తే.. బలహీన ట్రెండ్ కారణంగా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక, వెండి ధరలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. మంగళవారం వెండి ధర కూడా కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ.875 తగ్గి రూ.63,860కి చేరింది. గత ట్రేడ్‌లో కిలో వెండి రూ.64,735 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మంగళవారం ఔన్స్ బంగారం ధర 1919 డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి ధర 24.89 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక రూపాయి మారక విలువ 73.30 గా పలికింది.