గోదావరిలో పెరుగుతున్న వరద ఉధృతి

గోదావరికి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ప్రాణహితకు వరద ఉధృతి పెరగడంతో అధికారులు కాళేశ్వరం బ్యారీజీల నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

గోదావరిలో పెరుగుతున్న వరద ఉధృతి
Sanjay Kasula

|

Sep 03, 2020 | 11:54 AM

గోదావరికి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ప్రాణహితకు వరద ఉధృతి పెరగడంతో అధికారులు కాళేశ్వరం బ్యారీజీల నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలం దగ్గర నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి నీటిమట్టం 42.3 అడుగులలకు చేరింది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు… కాళేశ్వరం త్రివేణి సంగమం ఘాట్‌ దగ్గర 12.27 మీటర్ల వరకు నీరు చేరడంతో గోదావరి, ప్రాణహిత నదులు మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్నాయి. భారీ వరద కారణంగా అధికారులు కాళేశ్వరం వద్ద పూజలు, పుణ్యస్నానాలు నిలిపివేశారు.

పశ్చిమగోదావరి పోలవరంలో వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. కొత్తూరు కాజ్‌వేపై 12 అడుగులకు వరద చేరింది.. దీంతో 19 గిరిజిన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాఫన్‌ డ్యామ్‌ దగ్గర 26.2 మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది.. పోలవరం దగ్గర సీడబ్ల్యూసీ రీడింగ్‌ 12.10 మీటర్లు ఉంది.

ఇదే సమయంలో శబరి, తాలిపేరు, కిన్నెరసాని సైతం ఉప్పొంగుతుండగా, ధవళేశ్వరం వద్ద నిన్న సాయంత్రానికే 4 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. ఈ నీటిలో ఉభయ గోదావరి జిల్లా కాలువలకు 11,600 క్యూసెక్కులను పంపుతూ, మిగతా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా పోలవరం కాఫర్‌ డ్యామ్‌ వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. దేవీపట్నం దగ్గర గోదావరి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. చుట్టుపక్కల గ్రామాలకు వరద నీరు చేరడంతో…రాకపోకలు నిలిచిపోయాయి. పోచమ్మగండి, పూడిపల్లి, దేవీపట్నం గ్రామాల్లో వరద నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

మరోవైపు కృష్ణా నదికి ప్రధాన ఉపనదుల్లో ఒకటైన భీమాపై మహారాష్ట్రలోని ఉజ్జయిని డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చింది వచ్చినట్టుగా విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్ లోని ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకూ అన్ని రిజర్వాయర్లూ నిండిపోవడంతో, కాలువలన్నింటికీ పూర్తి స్థాయిలో నీరు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి డెల్టా కాలువలకు 16 వేల క్యూసెక్కులు, సముద్రంలోకి 15 వేల క్యూసెక్కుల నీరు వెళుతోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu