పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా పులస చేప కూర తినాలని పెద్దలు అంటూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా పులస చేప కూర తినలేదని చెప్తే గోదావరి జిల్లాల ప్రజలు మనవైపు విచిత్రంగా చూస్తారు. అవును వాళ్లు రేటు గురించి ఆలోచించరు, సంవత్సరానికి ఒకసారైనా పులుస చేపలను పొయ్యిమీద ఉడికించకపోతే అదోలా ఉంటుంది వాళ్లకి. పులస అంటే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలే. పులస చేపల్ని హిల్సా ఫిష్ అని పిలుస్తారు. ఇవి ఆస్ట్రేలియా సముద్ర జలాల్లో ఉంటాయి. వర్షాకాలం మొదలవగానే… ఇవి భారతదేశం వైపు ప్రయాణం ప్రారంభిస్తాయి. సరిగ్గా భారత్ లో వానలు పడి, గోదావరి వదర నీటితో ఉప్పొంగుతోన్న సమయంలో పులస చేపలు… సముద్రం నుంచి… గోదావరి నీటిలోకి… ఎదురీదుతూ ప్రయాణిస్తాయి. అక్కడ ఈ చేపల కలర్ మారిపోతుంది. గోదావరి జలాల్లో ప్రయాణించడం వల్ల వీటి టేస్టు కూడా మారుతుంది. అటు సముద్ర జలాలు, ఇటు గోదావరి జలాలలో ఈదడం వలన… ఈ చేపలు అద్భుతమైన రుచి కలిగివుంటాయి. గోదావరి జలాల్లో ఈ చేపలు పిల్లల్ని పెడతాయి. ఆ సమయంలో వీటిని పట్టుకుంటారు మత్సకారులు. ఈ పులస చేపల్ని ములక్కాయలతో కలిపి వండితే ఆ టేస్ట్ వర్ణించ వీలులేనిది అని గోదావరి జిల్లాల ప్రజలు చెప్పే మాట. పులస చేపల కోసం ఏడాది అంతా ఎదురుచూస్తూ ఉంటారు చాలామంది. ఈసారి కోవిడ్ ప్రభావంతో… ఎక్కువగా ఈ చేపలు మార్కెట్‌లోకి రాలేదు. ఏడాదిలో ఒక నెల మాత్రమే లభించే ఈ సీజనల్ చేపల రేటు కూాడా భారీగానే ఉంటుంది. ప్రస్తుతం కేజీ పులస రూ.4500 పలుకుతోంది. అయినా వెనక్కి తగ్గడం లేదు పులస ప్రియులు.
Also Read : సుశాంత్‌ని అలా అనుకునేవాళ్లు తెలివిలేని వాళ్లు.. డెన్మార్క్ సింగర్ కీలక విషయాలు